అసలేం జరిగిందంటే… నవీ ముంబైలో గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్రయాణిస్తున్న మహిళ తన కారుతో సహా బేలో పడిపోయింది. నవీ ముంబైలోని బేలాపూర్‌లో, శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్రయాణిస్తున్న ఒక మహిళ తన కారుతో పాటు బేలో పడిపోయింది. ఆ మహిళ బేలాపూర్ నుంచి ఉల్వేకు వెళుతుండగా…గూగుల్ మ్యాప్స్‌లో ఆమెకు వంతెన పైన ఉన్న మార్గం కనిపించలేదు.. దాని కింద ఉన్న మార్గం కనిపించింది. ఆ తర్వాత ఆ మహిళ కిందకు వెళ్లి నేరుగా బేలో పడిపోయింది. ఈ క్రమంలోనే.. అక్కడ ఉన్న మెరైన్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఈ సంఘటనను చూశారు.. వెంటనే అప్రమత్తమయ్యారు.. వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. భద్రతా దళంలోని వ్యక్తులు దగ్గరగా వచ్చినప్పుడు, ఆ మహిళ అందులో తేలుతున్నట్లు గుర్తించారు. వెంటనే సెక్యూరిటీ గార్డులు లోపలికి వెళ్లి.. ఆమెను బయటకు తీసుకొచ్చారు. తరువాత క్రేన్ సహాయంతో కారును కూడా బయటకు తీశారు. ఆ తర్వాత ఆ మహిళను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు. గూగుల్ మ్యాప్స్ కారణంగా భారతదేశంలో ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోహినూర్ ధరిస్తే అరిష్టమా ?? అసలు చరిత్ర ఇదే
Sania Mirza: అతనితో రొమాన్స్ కి రెడీ అంటున్న సానియా మీర్జా
రీల్స్ పిచ్చి తో హత్యలు కూడా చేస్తున్నారా ?? చివరికి తోడబుట్టిన అక్కని కూడా!
పుణ్యానికి పోతే.. పాపం ఎదురైంది.. కట్ చేస్తే జైలు పాలయ్యాడు
ఆఫీస్ లో మీటింగ్ అయ్యింది.. కట్ చేస్తే బిల్డింగ్ పైనుంచి దూకేసిన టెకీ