ఖమ్మంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్లే జోన్లు, స్విమ్మింగ్ పూల్

ఖమ్మంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్లే జోన్లు, స్విమ్మింగ్ పూల్


సాధారణంగా నగరాల్లో మనుషులు సేద తీరడానికి, వాకింగ్ చేయడానికి పార్కులు ఉంటాయి. కానీ, పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా ఒక పార్కు ఉంటే? ఆ ఆలోచనకే రూపం ఇస్తూ ఖమ్మం నగరంలో సరికొత్త ‘పెట్ పార్క్’ ప్రారంభానికి సిద్ధమైంది. తమ పెంపుడు జీవాలను ప్రాణప్రదంగా చూసుకునే నగరవాసులకు ఇది ఒక గొప్ప శుభవార్త. నగరంలోని 12, 20వ డివిజన్ల సరిహద్దులో సుమారు రూ. 50 లక్షల వ్యయంతో ఈ పార్కును నిర్మించారు. కేవలం జంతువులకే కాకుండా, వాటి యజమానులకు సైతం ఆహ్లాదాన్ని పంచేలా దీనిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పార్కు గోడలపై రంగురంగుల జంతువుల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ సందర్శకులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. పెంపుడు జంతువులు ఆడుకోవడానికి ప్రత్యేక ప్లే ఎక్విప్‌మెంట్, స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేశారు. ఇవి జంతువులు స్వేచ్ఛగా గంతులు వేస్తూ కేరింతలు కొట్టేందుకు వీలు కల్పిస్తాయి. తమ పెంపుడు జంతువులను తీసుకొచ్చే యజమానుల కోసం ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ సిద్ధం చేశారు. చిన్నారులు ఆడుకోవడానికి కూడా ప్రత్యేకంగా ప్లే ఏరియాను నిర్మించారు. పనులన్నీ చివరి దశకు చేరుకోవడంతో అధికారులు త్వరలోనే ఈ పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటివరకు పెంపుడు జంతువులను రోడ్లపైకి తీసుకెళ్లడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఇకపై యజమానులకు తొలగిపోనున్నాయి. ఒకే ప్రాంగణంలో అటు మూగజీవాలకు వినోదం, ఇటు మనుషులకు ఆరోగ్యం లభించేలా రూపొందించిన ఈ ‘పెట్ పార్క్’ నగరానికే తలమానికంగా నిలవనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే

8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?

చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి

తండ్రిని భుజంపై మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..

ప్రమాదకర విన్యాసాలతో హైవేపై రెచ్చిపోయిన యువకులు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *