నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. అయితే, ఆయన తదుపరి సినిమాపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బాలకృష్ణ ఒక క్రేజీ దర్శకుడితో సినిమా చేసే అవకాశం ఉంది. అనుకున్న స్థాయిలో అఖండ 2 ప్రదర్శన కనబరచకపోవడంతో, నందమూరి నటసింహం తన రాబోయే సినిమా ప్రణాళికలను మార్చుకున్నారు. మొదట అనుకున్న పీరియాడిక్ కథను పక్కనపెట్టి, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ముంబై మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. NBK 111 తర్వాత బాలయ్య, మలయాళ బ్లాక్ బస్టర్ మార్కోకు దర్శకత్వం వహించిన హనీఫ్ అదేనితో కలిసి పనిచేస్తారనే ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం :