గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు గుడ్లు తినకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారు పొరపాటున కూడా గుడ్డులోని పసుపు భాగం తినకూడదంట. ఎందుకంటే? ఇందులో పెద్ద మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువలన ఇది శరీరానికి హాని చేసే ప్రమాదం ఉంది. అందుకే గుండె సమస్యలు ఉన్నవారు కోడి గుడ్లు తినకూడదంట.
ప్రస్తుతం చాలా మంది జీర్ణసంబంధమైన సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే జర్ణసంబంధమైన సమస్యలు ఉన్న వారు కూడా ఎగ్స్ తినకపోవడమే మంచిదంట. జీర్ణక్రియ అనేది సాఫీగా జరకున్నా, లేదా ఎప్పుడూ కడుపు నొప్పి సమస్య ఉన్నవారు, ముఖ్యంగా IBS ఉంటే, కోడి గుడ్లు తినకూడదంట. లేకపోతే దీని వలన అనేక సమస్యలు చుట్టుముడుతాయంట.
ప్రస్తుత రోజుల్లో తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా చాలా మంది మూత్ర పిండాల వ్యాధి బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా పెద్ద వారి నుంచి యువత వరకు చాలా మంది కిడ్నీల్లో రాళ్ల సమస్యతో సతమతం అవుతున్నారు. అయితే కోడి గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన కిడ్నీ రోగులు ఎట్టి పరిస్థితుల్లో కోడి గుడ్లు తినకూడదంట. ఇది సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందంట.
అలాగే అలర్జీ సమస్య ఉన్న వారు కూడా గుడ్లకు దూరం ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివైనప్పటికీ, అలెర్జీ సమస్య ఉన్న వారు ప్రతి రోజూ కోడి గుడ్లు తినడం వలన ఇవి చర్మ సమస్యలు లేదా శ్వాస సమస్యలను తీసుకొస్తాయంట. అందుకే వీలైనంత వరకు ఈ సమస్యలతో బాధపడే వారు కోడిగుడ్లకు దూరం ఉండాలి.
కోడి గుడ్లలో అరాకిడోనిక్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారిని చాలా నష్టాన్ని చేకూరుస్తుందంట. అందుకే అర్థరైటిస్ సమస్యతో బాధపడే వారు కోడి గుడ్లు తినకూడదంట. లేకపోతే ఇది కాళ్లు, కీళ్లలో వాపు వంటి సమస్యలకు కారణం అవుతుందని చెబతున్నారు నిపుణులు.