కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు

కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు


వివాహానంతరం మరొకరితో ప్రేమలో పడుతుంటారు చాలామంది. ఈ క్రమంలో భార్య, భర్తను అడ్డుగా భావించి వారిని తొలగించుకోడానికి హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల చాలా చూశాం. సహజీవనం పేరుతో అక్రమ సంబంధాలు నెరపుతూ కన్న బిడ్డలను కూడా కడతేర్చిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ కోటిన్నర రూపాయాలు వెచ్చించి తన ప్రియుడ్ని సొంతం చేసుకుంది. అయితే ఆమె ఖర్చుచేసిన డబ్బు ఏ మర్డర్‌ కోసమో సుపారీ ఇచ్చి ఉంటుంది అనుకునేరు.. కానేకాదు.. తన ప్రియుడి భార్యనుంచి అతన్ని కొనుక్కుంది. మీరు విన్నది నిజమే. ఈ ఆశ్చర్యకరమైన ఈ ఘటన భోపాల్‌లో జరిగింది. ఈ ఘటన గురించి వింటుంటే ఎస్‌వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా గుర్తొస్తుంది కదా.. ఆ సినిమాలో పేదరికంతో విసిగిపోయిన భార్య డబ్బుకోసం భర్తను అమ్మేస్తుంది.. కానీ ఇక్కడ డబ్బుకోసం భార్య భర్తను అమ్ముకోలేదు..తన భర్త కోరిక మేరకు అతన్ని తన ప్రేయసికి అప్పగించడానికి డబ్బు తీసుకుంది. అదికూడా తన కుటుంబాన్ని పోషించుకోడానికి ఆ భార్య భర్తను విక్రయించింది. ఈ అరుదైన ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. ఈ విక్రయం న్యాయస్థానం సాక్షిగా జరగడం విశేషం. భోపాల్‌లో 42 ఏళ్ల వ్యక్తికి 23 ఏంళ్ల క్రితం పెళ్లయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. అతనికి తన కార్యాలయంలో మరో మహిళతో సంబంధం నెరపుతున్నాడు. ఈ క్రమంలో అతని 16 ఏళ్ల కుమార్తె తన తండ్రి మరో మహిళతో సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేసింది. కోర్టు భార్యాభర్తలు, అతని ప్రియురాలిని కౌన్సెలింగ్‌కు పిలిచింది. అయితే తాను ప్రియురాలితోనే ఉంటానని భర్త స్పష్టం చేశాడు. దీంతో తన భర్తను ప్రియురాలికి వదిలిపెట్టడానికి రూ.1.5 కోట్లు ఇవ్వాలని భార్య డిమాండ్‌ చేసింది. దీనికి ప్రియురాలు కూడా ఒప్పుకోవడంతో 23 ఏళ్ల వారి వివాహ బంధానికి తెరపడింది. ఆ భార్యకు ఒక డూప్లెక్స్‌ ఇంటితో పాటు 27 లక్షల నగదును ప్రియురాలు చెల్లించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆ ఇంట్లో జీవించేందకు సిద్ధమైంది. ఈ ఘటన నెట్టింట చేరి చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు’ స్టార్ హీరోయిన్ ఆవేదన

Rajinikanth: మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్‌ గురూ..!

Nagarjuna: ‘ధురంధర్’లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *