ఆవాల నూనె: ఆవాల నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇది తలకు రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. కాలుష్యం లేదా ఒత్తిడి వల్ల జుట్టు రాలేవారికి ఆవ నూనె గొప్ప ఔషధం. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రు, ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. ఆవాల నూనెను వేడి చేసేటప్పుడు అందులో కొన్ని కరివేపాకులను వేసి మరిగిస్తే జుట్టు నల్లగా, బలంగా పెరుగుతుంది.