కెరీర్‌లో ఒకే ఒక్క సెంచరీ.. అదీనూ టీమిండియాపైనే.. కట్ చేస్తే.. 13 ఏళ్ల జైలు శిక్ష.. ఎవరో తెల్సా

కెరీర్‌లో ఒకే ఒక్క సెంచరీ.. అదీనూ టీమిండియాపైనే.. కట్ చేస్తే.. 13 ఏళ్ల జైలు శిక్ష.. ఎవరో తెల్సా


క్రిస్ లూయిస్.. ఈ పేరు పెద్దగా క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలియకపోవచ్చు. రికార్డుల కంటే.. అవమానాలు, వివాదాలతోనే ఈ క్రికెటర్ ఫేమస్ అయ్యాడు. ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ క్రిస్ లూయిస్ ఒకసారి రూ. 1.5 కోట్ల విలువైన కొకైన్‌తో ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డాడు. తన క్రికెట్ కెరీర్‌లో కేవలం ఒక్క సెంచరీ మాత్రమే కొట్టాడు. అది కుడా టీమిండియాపైనే సాధించాడు. ఎంతగానో టాలెంట్ ఉన్న ఈ క్రికెటర్.. ఎప్పుడూ వివాదాలతోనూ, క్రమశిక్షణారాహిత్యంతోనూ వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. ఇందువల్లే దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. ఇంగ్లాండ్ నేషనల్ టీంకు ఎక్కువగా సెలెక్ట్ కాలేకపోయాడు.

క్రిస్ లూయిస్ తన అంతర్జాతీయ కెరీర్‌లో.. ఆరు విదేశీ పర్యటనలు చేశాడు. 1993లో భారత పర్యటనకు వచ్చిన అతడు.. చెన్నైలో టెస్ట్ ఆడి అద్భుతమైన సెంచరీ చేశాడు. ఇక అతడి కెరీర్‌లో నమోదైన ఒకే ఒక్క సెంచరీ ఇది. లూయిస్ సెంచరీ చేసినా.. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీని తర్వాత అతడిపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. కట్ చేస్తే.. దెబ్బకు కెరీర్ ముగిసింది.

అరెస్ట్, ఆపై 13 ఏళ్ల జైలు..

2008వ సంవత్సరం చివర్లో.. క్రిస్ లూయిస్ దాదాపు రూ. 1.5 కోట్లు విలువ చేసే కొకైన్‌తో గాట్విక్ విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో సాక్ష్యాలు అన్ని కూడా లూయిస్‌కు వ్యతిరేకంగా ఉండటంతో.. అతడికి 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత మంచి ప్రవర్తన రిత్యా అతడ్ని 6 ఏళ్ల అనంతరం జైలు నుంచి విడుదల చేశారు.

ఇది చదవండి: ఎవర్రా సచిన్.! 140 సెంచరీలు, 36 వేలకుపైగా పరుగులు.. ఈ తోపు బ్యాటర్ బరిలోకి దిగితే బౌలర్లకు వణుకే.. 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *