మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చిరంజీవి తన వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి వింటేజ్ లుక్ తో పాటు తన కామెడీతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు చిరంజీవి నెక్ట్స్ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మెగాస్టార్ లైనప్ చేసిన సినిమాల్లో విశ్వంభర సినిమా ఒకటి. వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఓయమ్మో..! కుష్బూ కూతురు అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. త్వరలోనే ఎంట్రీ
నిజానికి ఈ సినిమా మన శంకరవరప్రసాద్ గారు సినిమాకంటే ముందే విశ్వంభర రావాల్సి ఉంది.. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ సినిమా ముందు విడుదలైంది. ఇక విశ్వంభర సినిమా తర్వాత చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి బాబీతో కలిసి చిరంజీవి సినిమా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సినిమా సెట్‌లో ఆ హీరోని నిజంగానే కొట్టా..! షాకింగ్ విషయం చెప్పిన నటుడు
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెగాస్టార్ కూతురిగా ఓ హీరోయిన్ నటిస్తుందని గతకొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా చిరంజీవి కూతురిగా యంగ్ బ్యూటీ కృతిశెట్టి నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఛాంపియన్ మూవీ హీరోయిన్ అనస్వర రాజన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ అమ్మడు దాదాపు కన్ఫర్మ్ అన్నారు. కానీ ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తుంది. కన్నప్ప సినిమాతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ ప్రీతీ ముకుందన్ మెగాస్టార్ కూతురిగా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. మెగాస్టార్ సినిమాతో ఈ చిన్నదాని క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
చదివింది 4వ తరగతి..! 14ఏళ్లకే పెళ్లి.. 450కి పైగా సినిమాలు..!! స్టార్ హీరోలకు చమట్లు పట్టించింది
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి