కూల్ డ్రింక్స్ తాగితే ఆ సమస్యలు తగ్గిపోతాయా..? అయితే మీ అంత అమాయకులు ఎవరూ ఉండరు..

కూల్ డ్రింక్స్ తాగితే ఆ సమస్యలు తగ్గిపోతాయా..? అయితే మీ అంత అమాయకులు ఎవరూ ఉండరు..


నేటి ఉరుకుల పరుగుల జీవితం, జంక్ ఫుడ్ పుణ్యమా అని ప్రతి ఇంట్లో గ్యాస్, అసిడిటీ కామన్ అయిపోయాయి. కడుపు ఉబ్బరంగా అనిపించగానే చాలామంది చేసే మొదటి పని.. వెంటనే ఒక కూల్ డ్రింక్ బాటిల్ కొని గటగటా తాగేయడం. తాగిన కాసేపటికే ఒక పెద్ద త్రేనుపు రాగానే అబ్బా.. గ్యాస్ పోయింది, హాయిగా ఉంది అని ఫీల్ అయిపోతారు. కానీ అక్కడే అసలు ప్రమాదం దాగి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు వచ్చే ఆ త్రేనుపు కడుపులో ఉన్న గ్యాస్ అనుకుంటే పొరపాటే. నిజానికి సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉండే కార్బన్ డయాక్సైడ్ వాయువు త్రేనుపు రూపంలో బయటకు వస్తుంది తప్ప.. మీ కడుపులోని సమస్య తగ్గదు. పైగా ఇది తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినట్లు అనిపించినా, దీర్ఘకాలంలో కడుపులో ఒత్తిడిని పెంచి యాసిడ్ రిఫ్లక్స్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది.

సాఫ్ట్ డ్రింక్స్ ఎందుకు డేంజర్?

గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల ప్రకారం.. ఈ డ్రింక్స్ తాగడం వల్ల కడుపు లోపల కొన్ని మార్పులు జరుగుతాయి. గ్యాస్ బుడగలు కడుపులో ఒత్తిడిని పెంచి, యాసిడ్ గొంతులోకి వచ్చేలా చేస్తాయి. వీటిలో ఉండే అత్యధిక చక్కెర కాలేయానికి శత్రువు. ఇది ఫ్యాటీ లివర్ సమస్యకు ప్రధాన కారణం. ఇవి స్వతహాగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉండి, కడుపులోని సహజ జీర్ణ ప్రక్రియను దెబ్బతీస్తాయి.

మరి పరిష్కారం ఏంటి?

అసిడిటీగా ఉన్నప్పుడు కృత్రిమ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా మన వంటింట్లో ఉండే ఈ సహజ ప్రత్యామ్నాయాలను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు:

అల్లం నీరు: ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

చల్లని పాలు: తక్కువ కొవ్వు ఉన్న చల్లని పాలు తాగితే కడుపులోని యాసిడ్ తటస్థీకరించబడుతుంది.

జీలకర్ర లేదా సోంపు నీరు: గ్యాస్ సమస్యకు ఇవి శాశ్వత, సురక్షితమైన పరిష్కారాలు.

హెర్బల్ టీ: ఇది కడుపులోని మంటను తగ్గించి చల్లబరుస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *