శరీరంలోని కీళ్లకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చినా.. వాటిని పట్టించుకోవడం చాలా అవసరం. కొన్నిసార్లు కీళ్ల నొప్పి, వాపు, కదలడానికి ఇబ్బంది, అప్పుడప్పుడు జ్వరం రావడం, చర్మంపై మచ్చలు లేదా వెన్నులో నొప్పి లాంటి లక్షణాలు ఆర్థరైటిస్‌కు గుర్తులుగా మారవచ్చు. ఇది మామూలుగా కీళ్లను ప్రభావితం చేసే వాపుతో కూడిన జబ్బు. ఇది వయసు, జీవనశైలి, శరీరంలోని శక్తివంతమైన స్పందనల ఆధారంగా వస్తుంది. ఈ జబ్బుతో బాధపడేవారు తమ రోజూవారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
ప్రోబయోటిక్ పదార్థాలు
శరీరంలోని జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో సాయపడే పెరుగు, గంజి, పనీర్, అలాగే కొన్ని ఊరగాయలు లాంటి ప్రోబయోటిక్ పదార్థాలు కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించడంలో సాయపడతాయి.
ఆకుకూరల ఉపయోగం
పాలకూర, మునగాకు లాంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణ ఇస్తూ కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రతిరోజూ కొన్ని రకాల ఆకుకూరలను ఆహారంలో చేర్చడం వల్ల వాపును తగ్గించుకోవచ్చు.
పసుపు ప్రాముఖ్యత
వంటలో తరచుగా వాడే పసుపు.. సహజంగా వాపును తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని వాపును తగ్గించి కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి పసుపును రోజూవారీ ఆహారంలో ఎక్కువగా ఉపయోగించడం మంచిది.
నారింజ లాంటి పండ్లు
విటమిన్ C చాలా ఉన్న నారింజ లాంటి పండ్లు శరీరంలోని వాపును తగ్గించడంలో సాయపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి.
బెర్రీలు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీలు, బ్లాక్బెర్రీలు వంటి బెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు శరీరంలోని జబ్బు కారకాలను తగ్గించి వాపును నివారించడంలో సహాయపడతాయి. బెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడి.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నట్స్
బాదం, వేరుశెనగ, వాల్ నట్ లాంటి గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కీళ్ల బలాన్ని పెంచుతూ శక్తివంతమైన శరీరాన్ని ఇస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)