కీమో సైడ్‌ఎఫెక్ట్స్‌ తగ్గాలంటే? చికిత్సతో పాటు చక్కని ఆహారం.. క్యాన్సర్ రోగులకు ఆయుర్వేద సలహాలు

కీమో సైడ్‌ఎఫెక్ట్స్‌  తగ్గాలంటే? చికిత్సతో పాటు చక్కని ఆహారం.. క్యాన్సర్ రోగులకు ఆయుర్వేద సలహాలు


ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రాణాలను కాపాడటం ఒక సవాలుగా మారింది. చాలా మంది క్యాన్సర్ రోగులు అల్లోపతి చికిత్సపై ఆధారపడతారు. కానీ, ప్రస్తుతం కొంతమంది సహాయక చికిత్స కోసం ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు. క్యాన్సర్ చికిత్సను నయం చేయడంలో ఆయుర్వేదం ప్రయోజనకరంగా పనిచేస్తుందని స్వామి రామ్‌దేవ్ బాబా వివరించారు. క్యాన్సర్‌పై ఆయుర్వేదం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో ఇక్కడ చూద్దాం..

రామ్‌దేవ్ బాబా ప్రకారం.. క్యాన్సర్ బాధితులకు వైద్య చికిత్స తప్పనిసరి. అయినప్పటికీ రోగులు వారి ఆహారం, జీవనశైలిపై కూడా శ్రద్ధ వహించాలని బాబా రామ్‌దేవ్ అంటున్నారు. ఇది రోగులు వ్యాధి నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. ఆయుర్వేదం కొన్ని ఆహారాలను క్యాన్సర్‌ నయం చేసేవిగా పనిచేస్తాయని చెబుతోంది. ఇవి చికిత్సకు ప్రత్యామ్నాయాలు కానప్పటికీ, వైద్యుడి సలహా మేరకు చికిత్స సమయంలో వీటిని తీసుకోవచ్చునని అంటున్నారు.

క్యాన్సర్ చికిత్సలో సరైన ఆహారం అతి ముఖ్యం: క్యాన్సర్ చికిత్స రోగి రోగనిరోధక శక్తిని గణనీయంగా తగ్గిస్తుందని స్వామి రామ్‌దేవ్ వివరించారు. ఈ సమయంలో అనేక సైడ్‌ఎఫెక్టస్‌ని కలిగిస్తుంది. అలాంటి సందర్భాలలో ఆయుర్వేదం ఈ దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. చాలా మంది రోగులు జీర్ణ సమస్యలు, ఆకలి లేకపోవడం, బలహీనతను ఎదుర్కొటారు. అందువల్ల ఆయుర్వేదం క్యాన్సర్ చికిత్స సమయంలో తీసుకుంటే ప్రయోజనకరంగా ఉండే కొన్ని ఆహారాలను సూచిస్తుంది. ఈ ఆహారాలు తినడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, బలహీనతను తగ్గించడానికి సహాయపడతాయి. ఆయుర్వేదం, పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ క్రింద సూచించిన ఆహారాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ చికిత్స సమయంలో తీసుకోవాల్సిన ఆహారం:

బార్లీ నీరు, తిప్పతీగ రసం, కాయధాన్యాలు, చిక్కుళ్ళు, ఆకుపచ్చ కూరగాయలు, వీట్ గ్రాస్ జ్యూస్‌, వేప రసం వంటివి తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. క్యాన్సర్‌ చికిత్సలో సైడ్‌ఎఫెక్ట్స్ తీవ్రతను తగ్గిస్తుంది.

క్యాన్సర్‌ చికిత్స సమయంలో తినకూడని ఆహారాలు:

చక్కెర, వేయించిన ఆహారం, రెడ్‌మీట్‌, ఉప్పు తీసుకోవడం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆయుర్వేదంలో పేర్కొన్న ఈ పదార్థాలు క్యాన్సర్ చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని మీ ఆహారంలో సహాయక సంరక్షణగా మాత్రమే చేర్చుకోవచ్చు.. అయితే, వాటిని మీ ఆహారంలో చేర్చే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *