కాళ్ల తిమ్మిర్ల వెనుక సైలెంట్ కిల్లర్.. లైట్ తీసుకున్నారో మీ ప్రాణాలకే రిస్క్..

కాళ్ల తిమ్మిర్ల వెనుక సైలెంట్ కిల్లర్.. లైట్ తీసుకున్నారో మీ ప్రాణాలకే రిస్క్..


రోజంతా పని చేసి ఇంటికొచ్చాక కాళ్లు గుంజుతున్నాయా..? రాత్రి పడుకున్నప్పుడు పిక్కలు పట్టినట్లు అవుతున్నాయా? అలసట వల్ల ఏమోలే అని సరిపెట్టుకుంటున్నారా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. కాళ్లలో వచ్చే తిమ్మిర్లు, నొప్పులు కేవలం అలసట వల్ల మాత్రమే రావని.. అవి శరీరంలో పెరుగుతున్న ఏదో ఒక తీవ్రమైన అనారోగ్యానికి ముందస్తు హెచ్చరికలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డిమిత్రి యారోనోవ్ అభిప్రాయం ప్రకారం.. మీరు నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి లేదా తిమ్మిరి వచ్చి, విశ్రాంతి తీసుకోగానే తగ్గిపోతుంటే అది పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీ కాళ్లకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడ్డాయని అర్థం. దీనిని సకాలంలో గుర్తించకపోతే పాదాలు మొద్దుబారిపోయి.. తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

లోపం ఎక్కడుంది?

శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు కండరాలు ఉద్రిక్తంగా మారుతాయి. మెగ్నీషియం, పొటాషియం లేదా కాల్షియం తగ్గడం వల్ల కండరాలు సరిగ్గా పనిచేయవు. విటమిన్ డి, రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు కూడా తిమ్మిర్లకు ప్రధాన కారణాలు. కొత్తగా ఏదైనా మెడిసిన్ వాడుతున్నప్పుడు లేదా తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు.

ఎప్పుడు ఆందోళన చెందాలి?

సాధారణంగా ఎక్కువసేపు కూర్చోవడం లేదా డీహైడ్రేషన్ వల్ల వచ్చే తిమ్మిర్లు కొద్దిసేపటికే తగ్గిపోతాయి. కానీ పడుకున్నప్పుడు లేదా విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా తిమ్మిర్లు వస్తుంటే.. జలదరింపుతో పాటు కండరాల బలహీనత కనిపిస్తుంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలి.

వీరు జాగ్రత్త

మధుమేహం, థైరాయిడ్ లేదా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు కాళ్ల నొప్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వారానికి మూడు నాలుగు సార్లు తిమ్మిర్లు వస్తుంటే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ లెవల్స్, కిడ్నీ పనితీరును తనిఖీ చేయించుకోవడం ద్వారా పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *