కారులో నిద్రపోవడం ఎంత హాయిగా అనిపించినా అంతే ప్రాణాంతకం కావచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మీరు ఏసీ ఆన్‌లో పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు.. ఈ విషయం తెలిస్తే మీరు కొంచెం ఆశ్చర్యపోతారు. కానీ కారు ఏసీ కూడా మీ జీవితానికి శత్రువుగా మారవచ్చంటున్నారు. ఏకంగా ప్రాణాలే తీస్తుందంటున్నారు.
ఇటీవల, నోయిడాలోని సెక్టార్ 62 సమీపంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఇది అందరినీ షాక్‌కు గురిచేసింది. వాస్తవానికి, కారు డ్రైవర్.. అతని స్నేహితుడు ఇద్దరూ క్యాబ్‌లో నిద్రపోయారు. అయితే కారు డ్రైవర్ ఇంటికి చేరుకోకపోవడంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు అతనికోసం వెతకడం ప్రారంభారు. ఎట్టకేలకు వారు కారును కనుగొన్నప్పుడు అందులో నిద్రపోతున్న ఇద్దరిని గుర్తించారు. చివరికి కారు గ్లాస్ పగలగొట్టి చూసేసరికి ఇద్దరూ విగతజీవులై కనిపించారు.
ఈ సంఘటన తర్వాత, మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఏసీ ఒకరిని ఎలా చంపగలదు? అయితే వారిద్దరూ ఎలా చనిపోయారో తెలుసుకోవడానికి, పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపారు. ప్రాథమిక దర్యాప్తులో, ఏసీ ఆన్ చేసిన తర్వాత ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. అయితే కారులో ఊపిరాడక ఇద్దరు వ్యక్తులు మరణించారని పోలీసులు నిర్ధారించారు.
కార్బన్ మోనాక్సైడ్ లీకేజ్:
కారు ఇంజిన్ నడుస్తున్నప్పుడు, దాని నుండి కార్బన్ మోనాక్సైడ్ వాయువు బయటకు రావడం ప్రారంభమవుతుంది. కానీ ఎగ్జాస్ట్ సిస్టమ్‌లో ఏదైనా సమస్య లేదా లీకేజ్ ఉంటే, ఈ వాయువు AC వెంట్‌ల ద్వారా కారులోకి ప్రవేశించి నిద్రిస్తున్న వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో కారులో ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసి, ఊపిరాడక మరణానికి కారణమవుతుంది.
ఆక్సిజన్ లేకపోవడం:
ఏసీ ఆన్‌లో ఉండి కారు పూర్తిగా మూసి ఉంటే, గాలి లోపల తిరుగుతూనే ఉంటుంది. మనం ఆక్సిజన్‌ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాము. అలాంటి పరిస్థితిలో కారు గాజు పూర్తిగా మూసి ఉన్నప్పుడు, కారు లోపల ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. చాలా సార్లు నిద్రపోతున్న వ్యక్తికి అది తెలియక ఊపిరాడకపోవడాన్ని కూడా గ్రహించలేడు. ఇది ప్రాణాంతకం కావచ్చు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కారులో నిద్రపోతున్నప్పుడు AC లేదా బ్లోవర్‌ని ఆన్ చేసే పొరపాటు చేయకండి.
మీరు కారు లోపల బలవంతంగా నిద్రపోతే, ఈ పరిస్థితిలో బయటి నుండి స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చేలా కిటికీని కొద్దిగా తగ్గించండి.
వాహనం సకాలంలో సర్వీస్ చేయకపోతే, ఇంజిన్ గ్యాస్ క్యాబిన్‌లోకి ప్రవేశించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..