కామెర్లు ముదిరి కన్నడ స్టార్ హీరో మృతి.. షాక్‌లో కన్నడ ఇండస్ట్రీ!

కామెర్లు ముదిరి కన్నడ స్టార్ హీరో మృతి.. షాక్‌లో కన్నడ ఇండస్ట్రీ!


ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కోమాలోకి వెళ్లిపోయిన సంతోష్ బాలరాజు.. చివరికి తుదిశ్వాస విడిచారు. దీంతో కన్నడ నాట విషాదం నెలకొంది. గతంలోనూ ఆయనకు ఈ సమస్య వచ్చిందని.. అప్పుడు చికిత్స తీసుకోవడంతో కామెర్లు తగ్గాయి. కానీ ఈసారి పరిస్థితి చేయి దాటిపోయింది. సంతోష్ బాలరాజుకు వయసు 38 సంవత్సారలు.. తండ్రి అనేకల్ బాలరాజ్ ప్రముఖ నిర్మాత. కన్నడలో పలు సినిమాలు నిర్మించారు. సంతోష్ బాలరాజు ఇంకా వివాహం చేసుకోలేదు. అతడికి తల్లి, సోదరి ఉన్నారు. ‘కెంపా’ సినిమా ద్వారా సంతోష్ బాలకరాజ్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘కరియా 2’, ‘జన్మ’, ‘గణప’ సినిమాల్లో నటించారు. మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యారు. ‘బర్కిలీ’, ‘సత్యం’ సినిమాలు ఇంకా విడుదల కాలేదు. ఈ క్రమంలోనే సంతోష్ బాలరాజు కామెర్లు ముదిరి ఈ హీరో మృతిచెందారు. ఇక ఈయన మృతిపై సినీప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతాడనుకున్న సంతోష్ .. ఇలా కామెర్ల వ్యాధితో తిరిగిరాని లోకాలను వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోవాలేక పోతున్నారు. ఆరోగ్యం విషయంలో సంతోష్‌ ఇంకాస్త జాగ్రత్తగా ఉండే బాగుండేదంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. గత సంవత్సరం సంతోష్‌ తండ్రి అనేకల్ బాలరాజ్ కూడా అనారోగ్య కారణాలతో మరణించారు. ఇప్పుడు సంతోష్ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర దుఃఖంలో ముగిపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సారథి స్టూడియోలో గొడవ.. షూటింగ్‌ను అడ్డుకుని కార్మికుడిని కొట్టిన యూనియన్ లీడర్

Renu Desai: రాజకీయ నాయకుల గురించి రేణు దేశాయ్‌ షాకింగ్ పోస్ట్.. ఆలా ఎలా అనేసింది

OTT ఆశలపై నీళ్లు చల్లిన ప్రొడ్యూసర్.. సక్కగా థియేటర్‌కు నడవాల్సిందే ఇక!

తను చదివించిన డాక్టర్లను చూసి స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో

Cryonics: మీరు చచ్చినా.. మేం చావనివ్వం..! మళ్ళీ బ్రతికిస్తాం.. కానీ..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *