కల్ట్ క్లాసిక్ బొమ్మరిల్లు మిస్ అయిన హీరో ఎవరో తెలుసా.? ఆయన చేసుంటే మరోలా ఉండేది

కల్ట్ క్లాసిక్ బొమ్మరిల్లు మిస్ అయిన హీరో ఎవరో తెలుసా.? ఆయన చేసుంటే మరోలా ఉండేది


తెలుగు సినిమాల్లో కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచిన సినిమాలు చాలా ఉన్నాయి. కాగా ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బొమ్మరిల్లు సినిమా ఒకటి. సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత జెనీలియా పేరు మారుమ్రోగింది. ఈ సినిమాలో ఆమె పేరు హాసిని. చాలా రోజులు ప్రేక్షకులు జెనీలియాని ఇదే పేరుతో పిలిచారు. అంతే కాదు కుర్రాళ్లు తమ లవర్ కు హాసిని అనే పేరు పెట్టుకున్నారు కూడా.. బొమ్మరిల్లు సినిమాలో లవ్ అండ్ ఎమోషన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా చూస్తే మంచి ఫీల్ వస్తుంది.

ఆ దర్శకుడి చేతిలో మోసపోయా.. ఏడుసార్లు అబార్షన్ చేయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్

ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవ్వనుంది. 2007లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 21మన మరోసారి థియేటర్స్‌లో సందడి చేయండని రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే బొమ్మరిల్లు సినిమాను ముందుగా ఓ స్టార్ హీరో చేయాలిసిందట కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ కథ సిద్దార్థ్ దగ్గరకు వెళ్ళింది. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఆయనే యంగ్ టైగర్ ఎన్టీఆర్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బొమ్మరిల్లు కథ నాకు బాగా నచ్చింది.  నా ఇమేజ్ వల్ల ఓ సినిమా హిట్ అవ్వకపోయిన పర్లేదు.. కానీ నా ఇమేజ్ వల్ల ఆ సినిమాకు రావాల్సిన ఇంపార్టెన్స్ తగ్గిపోతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది.

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

దిల్ రాజు వచ్చి నాకు బొమ్మరిల్లు కథ చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. అయ్యో ఈ సినిమా మిస్ అయిపోతుందే అని బాధపడ్డాను. నాకు బాగా నచ్చిన కథ అది. నా ఇమేజ్ ఆ సినిమాకు న్యాయం చేయదు. అందుకే ఆ సినిమాను వదులుకున్నాను అని ఎన్టీఆర్ అన్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే వార్ 2 సినిమాలో నటించాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అలాగే దేవర 2 సినిమా కూడా లైనప్ లో ఉంది.

ఇవి కూడా చదవండి

ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

Ntr

Ntr

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *