టాలీవుడ్ ను కొత్త అందాలు పలకరిస్తున్నాయి. అలా టాలీవుడ్ కు పరిచయమైన భామే ప్రీతి ముకుందన్. ఈ చిన్నది ఇటీవలే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది అందాల భామ.
ఇప్పుడు కన్నప్ప సినిమాతో మరోసారి ప్రేక్షకులను కవ్వించింది ప్రీతి ముకుందన్. మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కన్నప్ప సినిమాలో నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ నటించి ఆకట్టుకుంది.
ప్రీతి ముకుందన్ టీవీ షోలో నృత్య ప్రదర్శనలలో తన కెరీర్ ను ప్రారంభించింది.ప్రీతి ముకుందన్ మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ‘ముత్తు ము2’ యూట్యూబ్ లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి పేరొందినది. ఆ తర్వాత ఈ చిన్నదానికి సినిమా ఆఫర్స్ వచ్చాయి.
శ్రీవిష్ణు సరసన ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో హీరోయిన్ గా మారింది.‘ఓం భీమ్ బుష్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు కన్నప్ప సినిమాలో గ్లామర్ లుక్ లో మెరిసింది. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా ఈ చిన్నది కొని క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కన్నప్ప సక్సెస్ తో ప్రీతీ క్రేజీ ఆఫర్ అందుకుంది. నివిన్ పౌలీ సినిమాలో ప్రీతీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.