తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా అడవుల్లో మరోసారి మందు పాతర పేలింది. కర్రెగుట్ట సమీపంలోని చలిమేల గుట్టపై ఈ పేలుడు సంభవించింది. కట్టెలకోసమని అడవిలోకి వెళ్లిన ఓ గిరిజనుడు ఐఈడీ బాంబ్‌పై కాలుపెట్టి తీవ్ర గాయాల పాలయ్యాడు. వివరాల్లోకి వెలితే.. గత 20 రోజులుగా కర్రెగుట్ట సహా సమీప ప్రాంతాల్లోని గుట్టలపై తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు ఆ గుట్టపై ఉన్న మందు పాతరలను నిర్వీర్యం చేశారు. కాగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే చలిమెల గుట్లపై పెను ప్రమాదం సంభవించింది. భద్రతా బలగాల లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన చేసిన ఐఈడీ బాంబ్‌పై కాలుపెట్టిన ఓ గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ముక్కునూరుపాలెం గ్రామానికి చెందిన సోయం కామయ్య అనే గిరిజనుడు శుక్రవారం గ్రామ సమీపంలోని చలిమేల గుట్టలపై కంక బొంగులా కోసం వెళ్ళాడు. బొంగులు కొట్టడం కోసం అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో భద్రతా బలగాల లక్ష్యంగా అమర్చిన మందు పాతరను గమనించకుండా దానిపై కాలు పెట్టాడు. అతను దానిపై నుంచి అడుగు తీసిన వెంటనే ఆ మందుపాతర పేలిపోయింది.
ఈ ప్రమాదంలో కామయ్య తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి కామయ్య కాలు నుజ్జునుజ్జు అయిపోయింది. నొప్పిని భరించలేక కామయ్య కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించింది. నడవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కామయ్యను జోలెకట్టి గుట్టపై నుండి కిందకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.