యూపీఐ పేమెంట్స్ దేశ ఆర్థికవ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. త్వరలో మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టబోతోంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే UPI చెల్లింపుల కోసం పిన్ నమోదు చేయవలసిన అవసరం ఉండదు. యూజర్లు వారి ఫేస్ ID లేదా వేలిముద్రలు, కంటిలోని ఐరిస్‌ను ఉపయోగించి చెల్లింపులు చేయచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. మరికొన్ని నెలల్లో దీన్ని ప్రారంభించాలని NPCI భావిస్తోంది. ఇప్పటివరకు, UPI చెల్లింపుల కోసం 4 లేదా 6 అంకెల పిన్‌ను నమోదు చేయాల్సి వచ్చేది. కానీ, చాలా మంది తమ పిన్ నంబర్ తరచూ మర్చిపోతున్నారు లేదా పిన్ ఎవరికైనా తెలిస్తే మోసం చేసే అవకాశమూ ఉంది. అదీ కాక వృద్ధులకు లేదా సాంకేతికత గురించి అంతగా తెలియని వారికి పిన్ నమోదు చేయడం కష్టంగా అనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికే బయోమెట్రిక్ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నారు. పిన్‌కు బదులు బయోమెట్రిక్ అంటే వేలిముద్ర, ఫేస్ ఐడీ ఉపయోగించడం చాలా సులభం. సురక్షితం కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి వేలిముద్రలు, కంటిపాపలు ఎవరూ మ్యాచ్ చేయలేరు. మరో విషయం ఏంటంటే, బయోమెట్రిక్ ఫీచర్ వచ్చినప్పటికీ పిన్, ఫేస్ ఐడీ అందుబాటులో ఉంటాయి. యూజర్ తనకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. డిజిటల్ టెక్నాలజీ గురించి అవగాహన లేని గ్రామీణులు, వృద్ధులకు కొత్త ఫీచర్ వాడటం తేలిక అవుతుంది. ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉంది. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రావచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పర్ బెర్త్ ఎక్కి.. స్నాక్ కొట్టేస్తున్న చిల్లర దొంగ
బిల్డింగ్ లిఫ్ట్‌లో గలీజ్ పని చేసిన డెలివరీ బాయ్.కేసు నమోదు
మనిషి దంతాల వింత చేప.. పట్టుకుంటే అంతే
కొలను తవ్వుతుండగా అద్భుతం.. షాకైన గ్రామస్తులు..!
శ్రావణమాసంలో అద్భుతం..! శివుడి మెడలో నాగుపాము