ఔటర్ రింగు రోడ్డుపై నుంచి కింద పడ్డ కారు.. స్పాట్‌లో ఇద్దరు మృతి, మరో ముగ్గురికి సీరియస్

ఔటర్ రింగు రోడ్డుపై నుంచి కింద పడ్డ కారు.. స్పాట్‌లో ఇద్దరు మృతి, మరో ముగ్గురికి సీరియస్


హైదరాబాద్ మహానగరం శివారులోని ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా పోచారం ఔటర్ రింగు రోడ్డుపై నుంచి కారు కింద పడిపోయింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు ఈ ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

బోరంపేటకు చెందిన హరిప్రసాద్ భార్య మౌనిక కుమారుడు అగస్త్య, సుశ్రుత మరో ఇద్దరు అమృత, నవీన్ లతో కలిసి జూ పార్కుకి వెళ్లి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో కారు వేగంగా ఉండడంతో అదుపుతప్పి ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి పోచారం సమీపంలో కింద పడిపోయింది. ఈ ఘటనలో నవీన్(30) మౌనిక (36) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. సుశ్రుతకు సీరియస్ గా ఉండగా హరిప్రసాద్, అగస్త్య, అమృతకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని పటాన్ చెకరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *