ఓరీ దేవుడో నిలబడి నీళ్లు తాగితే ఇంత డేంజరా..? ఇప్పుడే ఆపండి.. నిజం తెలుసుకోండి!

ఓరీ దేవుడో నిలబడి నీళ్లు తాగితే ఇంత డేంజరా..? ఇప్పుడే ఆపండి.. నిజం తెలుసుకోండి!


ఓరీ దేవుడో నిలబడి నీళ్లు తాగితే ఇంత డేంజరా..? ఇప్పుడే ఆపండి.. నిజం తెలుసుకోండి!

నేటి బిజీగా ఉండే జీవనశైలిలో మనం ఎక్కువగా నిలబడి ఉన్నప్పుడే నీళ్లు తాగుతుంటాము. కానీ, ఈ సాధారణ చిన్న అలవాటు మన శరీరానికి చాలా ప్రమాదకరం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. నిలబడి ఉన్నప్పుడు నీరు తాగడం వల్ల అది నేరుగా కడుపులోకి బలంగా ప్రవహిస్తుంది. శరీరం దానిని గ్రహించకుండా నిరోధిస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగించడమే కాకుండా భవిష్యత్తులో కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలకు కూడా ప్రధాన కారణం కావచ్చు అంటున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, నిలబడి ఉన్నప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎలా అనారోగ్యానికి గురవుతారో తప్పక తెలుసుకోండి.

మోకాలు, కీళ్లలో నొప్పి:

నిలబడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని ఫ్లూయిడ్స్‌ బ్యాలెన్స్‌ దెబ్బతింటుంది. అనవసరమైన ఫ్లూయిడ్స్ అక్యుమిలేట్ అయిపోతాయి. దాంతో ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పి) వంటి సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.ఈ నీరు క్రమంగా మీ కీళ్ళు, మోకాళ్లలో పేరుకుపోతుంది. దీనివల్ల చిన్న వయసులోనే ఎముకల నొప్పి వస్తుంది.

మూత్రపిండాల సమస్యలు:

నిలబడి నీళ్లు తాగినప్పుడు అది ఫిల్టర్ చేయకుండా నేరుగా కిందకు వెళుతుంది. దీనివల్ల నీటిలోని మలినాలు మూత్రపిండాలలో పేరుకుపోతాయి. ఈ మలినం మూత్రపిండాలను దెబ్బతీసి వ్యాధులకు కారణమవుతుంది.

కడుపు నొప్పి:

నిలబడి నీరు తాగడం వల్ల కడుపు గోడపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. గ్యాస్, గుండెల్లో మంట, మలబద్ధకం వంటి కడుపు సమస్యలకు దారితీస్తుంది.

నీళ్లు తాగడానికి సరైన మార్గం ఏమిటి?:

– ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా కూర్చుని ఉన్నప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి.

– నీళ్ళన్నీ ఒకేసారి మింగకండి, గుటకలు వేస్తూ తాగాలి.

– చాలా చల్లటి నీరు తాగడం సరైనది కాదు. సాధారణ నీటిని మాత్రమే తాగాలి. చల్లని నీరు తాగితే జలుబు, తుమ్ములు వంటి సమస్యలు ఇబ్బందిపెడతాయి.

-ఉదయం ఖాళీ కడుపుతో.. గోరువెచ్చని నీరు తాగితే బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

– తాగే నీటి కోసం గాజు లేదా మట్టి కుండలను ఉపయోగించడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *