ఒక్క ఫోన్‌తో జీవితం ఛిన్నాభిన్నం

ఒక్క ఫోన్‌తో జీవితం ఛిన్నాభిన్నం


కానీ, అదే ఆ ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసేసింది. ముంబయి థానే జిల్లాకు చెందిన గౌరవ్ నికమ్ అనే వ్యక్తి ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాడు. రద్దీగా ఉండటంతో రైలు డోర్ దగ్గరే నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన ఓ దొంగ, అతడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను ఒక్కసారిగా లాక్కున్నాడు. ఈ హఠాత్పరిణామంతో గౌరవ్ అదుపుతప్పి కదులుతున్న రైలులో నుంచి జారి పడిపోయాడు. దురదృష్టవశాత్తు అతడి కాలు రైలు పట్టాలపై పడటంతో, రైలు చక్రాలు దానిపై నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అతడి కాలు నుజ్జునుజ్జయింది. ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న గౌరవ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ముంబ‌యి లోకల్ ట్రైన్లలో ఇలాంటి సెల్ ఫోన్ దొంగతనాలు సర్వసాధారణంగా మారాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డోర్ల వద్ద నిలబడిన వారిని లక్ష్యంగా చేసుకుని దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నా, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో రైళ్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని రైల్వే పోలీసులు తెలిపారు. ప్రయాణికులు కూడా డోర్ల వద్ద నిలబడి ఫోన్లు వాడొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫుల్‌గా మందు కొట్టాడ.. కారును రైల్వే ప్లాట్‌ఫామ్ పై పార్క్ చేసాడు.. అదే కదా మ్యాజిక్కు

బ్రొకోలీ తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *