అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య చాలా మంది ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెగ ఫేమస్ అవుతున్నారు. అయితే ఎవరికైనా సరే చాలా వీడియోస్ చేస్తేనే ఫేమ్ వస్తుంది. కానీ ఒక కుర్రాడికి మాత్రం చిన్న ఒక్క వీడియోనే తనకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. చేతిలో టీ గ్లాస్ పట్టుకొని, ఎలాంటి మేకప్ లేకుండా, చాలా నేచురల్‌గా టీ తాగుతూ.. ఆనందంగా మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపించాడు. ఈ వీడియో చాలా మందిని ఆకర్షించింది. దీంతో చాలా మంది ఈ వీడియోను తెగ ఉపయోగించుకుంటున్నారు.
మీమ్స్, కామెడీ వీడియోల్లో ఈ కుర్రాడి వీడియో తప్పనిసరి అయిపోయింది. ఇక ఏ వీడియో చూసినా నవ్వు వస్తుందో రాదో తెలియదు కానీ, ఈ కుర్రాడి వీడియో చూస్తే మాత్రం, నవ్వడం తప్పనిసరి. దీంతో ఈయన నెట్టింట తెగ డ్రెండ్ అవుతున్నారు. అంతే కాకుండా చాలా మంది ఈయన గురించి తెలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
అయితే చాలా మంది ఈ కుర్రాడు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవాడూ, అసలు మన ఇండియా అతను అవునో కాదు అనుకుంటుంటారు. కానీ ఈ కుర్రాడు ఇండియాకు చెందిన తెలుగు అబ్బాయి మాత్రమే కాకుండా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కుర్రాడు. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు చెందిన మాలపల్లి అనే గ్రామానికి చెందిన కుర్రాడు. ఈయన పేరు అరుణ్. పేద కుటుంబంలో జన్మించిన ఈ కుర్రాడు పదవ తరగతి చదివాడు. తర్వాత చదువు మానేసి, నెహ్రూ అనే వ్యక్తి వద్ద లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. రోజూ లారీ పనికి వెళ్లేవాడు.
అయితే ఒక రోజు లారీలో వెళుతూ ఉదయం ఒక చోట ఆగి టీ తాగుతున్నారు అరుణ్, లారీ డ్రైవర్ నెహ్రూ. అయితే నెహ్రూ చిన్న జోక్ వేయడంతో కుర్రాడు టీ గ్లాస్ పట్టుకొని పగలబడి నవ్వుతాడు. ఆ సమయంలో డ్రైవర్‌కు ఎందుకు వీడియో తీయాలనిపించిందో తెలియదు కానీ, దానిని తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో అది తెగ వైరల్ అయ్యింది.
అంతే కాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. దీంతో ఈ కుర్రాడు మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. వరసగా టీవీ ఛానల్స్‌కు,యూట్యూబ్స్ ఇంటర్వ్యూస్ ఇస్తూ.. సొంతంగా వీడియోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడంట.




