ఒక్కో ఊరిలో హడలెత్తిస్తున్న ఒక్కో పులి.. ఇక ప్రజలు ఉండేది ఎలా

ఒక్కో ఊరిలో హడలెత్తిస్తున్న ఒక్కో పులి.. ఇక ప్రజలు ఉండేది ఎలా


తూర్పుగోదావరి జిల్లా ప్రజలను పెద్దపులి హడలెత్తిస్తోంది. రోజుకో ఊరిలో ప్రత్యక్షమవుతూ ఆవులు, ఆవుదూడలను చంపి తినేస్తోంది. దీంతో ప్రజలు కంటిమీద కునుకులేకుండా భయంభయంగా గడుపుతున్నారు. రాజానగరం, తొర్రేడు, జగన్నాథపురం.. పుణ్యక్షేత్రం-భూపాలపట్నంలో పంజా విసిరిన పెద్దపులి బుధవారం ఓ పామాయిల్ తోటలో ఆవును బలితీసుకుంది. అనంతరం జి.యర్రంపాలెంలోని మరో తోటలో రెండు ఆవులు, దూడను చంపేసింది. గురువారం ఉదయం స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి అధికారులకు తెలిపారు. దీంతో అటవీశాఖ అధికారులతో పాటు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అక్కడికి చేరుకుని పరిశీలించారు. పులి ఎక్కడ ఉందో గుర్తించి బంధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనికోసం పుణె, దిల్లీ నుంచి నిపుణుల బృందం రాజమహేంద్రవరం చేరుకుంది. పులిని గుర్తిస్తే తుపాకీలో మత్తు ఇంజక్షన్‌ లోడ్‌ చేసి షూట్‌ చేయనున్నారు. పులి పంటపొలాలు, జనావాసాల్లో సంచరిస్తుండటంతో ప్రజలను ఒంటరిగా బటకు రావద్దని అలెర్ట్‌ చేస్తున్నారు ఫారెస్ట్‌ అధికారులు, పోలీసులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి

భూమి కింద మిస్సైల్ బేస్‌.. ప్రపంచానికి చాటిన’ఇరాన్’

ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. కట్ చేస్తే..

సముద్రంలో 4 కి.మీ ఈది, కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు

ప్రయాణికుడిపై పడిన వేడి వేడి కూర.. విమాన సంస్థకు దిమ్మ తిరిగే జరిమానా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *