సినీరంగంలోకి కొన్ని కాంబినేషన్స్ ప్రేక్షకులకు ఫేవరేట్ అవుతుంటారు. కొందరు హీరోహీరోయిన్స్ జోడి, కెమిస్ట్రీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. కానీ పలువురు హీరోలతో కలిసి నటించిన హీరోయిన్స్.. ఆ తర్వాత అదే హీరోలకు తల్లిగా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు అదే హీరోకు సరసన నటించిన పలువురు తారలు.. ఆ తర్వాత తల్లిగా, అత్తగా, వదినగా కనిపించారు. కానీ మీకు తెలుసా..? ఒకే హీరోయిన్ ఒకే సినిమాలో బాలయ్యకు, చిరంజీవికి తల్లిగా, భార్యగా నటించింది. అవును.. ఇప్పటికీ 50 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ టబు.
ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..
ఇవి కూడా చదవండి
మెగాస్టార్ చిరంజీవికి తల్లిగా, భార్యగా నటించింది టబు.ఆ సినిమా ఏదో కాదు..అందరివాడు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరు డబుల్ రోల్ చేశారు. ఇందులో తండ్రికొడుకులుగా కనిపించారు చిరు. అయితే ఈ చిత్రంలో చిరుకు భార్యగా కనిపించింది. అలాగే కొడుకుగా ఉన్న చిరుకు పిన్నిగా కనిపించింది. అలా ఒకే సినిమాలో చిరంజీవికి తల్లిగా, భార్యగా నటించింది టబు.
Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
అలాగే నందమూరి బాలకృష్ణకు సైతం ఒకే సినిమాలో అటు తల్లిగా, ఇటు భార్యగా కనిపించింది టబు. ఆ సినిమా మరెదో కాదు.. 2002లో విడుదలై చెన్న కేశవరెడ్డి. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేయగా.. ఫ్యాక్షనిస్ట్ అయిన తండ్రికి భార్యగా కనిపించింది. అలాగే కొడుకు పోలీస్ బాలయ్యకు తల్లిగా కనిపించింది. ఈ చిత్రంలో శ్రియా కథానాయికగా నటించగా.. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్. ప్రస్తుతం బాలయ్య అఖండ2 చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర సినిమాతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..
ఇవి కూడా చదవండి: Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..