ఒకప్పుడు మాల్స్‌లో పని చేసింది.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోప్ హీరోయిన్

ఒకప్పుడు మాల్స్‌లో పని చేసింది.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోప్ హీరోయిన్


ఎంతో మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వకముందు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు అనుభవించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆతర్వాత హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. టాలీవుడ్ లో ఈ అమ్మడు ఓ సక్సెస్ ఫుల్ హీరోయిన్. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత హీరోయిన్ గా మారింది.ముందుగా తమిళ్ లో సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది.ఇక్కడ కూడా హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను చూసింది ఈ అమ్మడు. పదో తరగతి లోనే పార్ట్ టైం జాబ్స్ చేసి కుటుంబానికి అండగా నిలిచింది. అలాగే మాల్స్ లో పనిచేసి డబ్బులు సంపాదించింది ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె ఎవరో కాదు తెలుగులో తక్కువ సమయంలోనే క్రేజ్ సొంతం చేసుకున్న అందాల భామ ఐశ్వర్య రాజేష్.

నటి ఐశ్వర్య రాజేష్ తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన విషాదాలను, వాటిని అధిగమించి నేడు తాను ఉన్న స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టాల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయానని, తన తల్లి నాగమణి ఎన్నో కష్టాలు పడి నలుగురు పిల్లలనుపెంచారని తెలిపింది. ఆమె తండ్రి 36-37 సంవత్సరాల వయసులోనే మరణించారు. అప్పటికి నాగమణి కూడా అదే వయసులో ఉన్నారు. చదువు లేకపోయినప్పటికీ, ఆమె పిల్లల భవిష్యత్తు కోసం అలుపెరుగని పోరాటం చేశారట. ఒక డాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన నాగమణి, సలీం మాస్టర్ వద్ద అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. అయితే పెళ్లి తర్వాత తన కెరీర్‌ను విడిచిపెట్టారు. కుటుంబ పోషణ కోసం నాగమణి ఎల్ఐసి ఏజెంట్‌గా, రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేశారు. ఆ కమిషన్లతోనే పిల్లల స్కూల్ ఫీజులు కట్టేవారు. అప్పుల కారణంగా చెన్నైలోని టీ నగర్‌లో ఉన్న తమ హౌసింగ్ బోర్డు ఇంటిని కూడా అమ్ముకుని అద్దె ఇంటికి మారాల్సి వచ్చిందని తెలిపింది ఐశ్వర్య రాజేష్. ఈ కష్టాలన్నీ చూసిన ఐశ్వర్య, తన తల్లి ఎలా తట్టుకుని నిలబడిందో ఇప్పటికీ అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. తన తల్లి జీవితాన్ని పూర్తిగా పిల్లల కోసమే త్యాగం చేశారని  ఐశ్వర్య గుర్తు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఐశ్వర్య రాజేష్ పదో తరగతి చదువుతున్న సమయం నుంచే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టిందట. మాల్స్‌లో ప్రమోషన్ యాక్టివిటీస్‌లో పాల్గొంటూ, కొత్త ప్రొడక్టులను ప్రచారం చేస్తూ నెలకు 500-1000 రూపాయలు సంపాదించి కుటుంబానికి సహాయపడేదట. ఆ తర్వాత మెల్లగా రియాలిటీ డాన్స్ షో లో పాల్గొని అందులో విజేతగా నిలిచింది. ఆ సమయంలోనే ఆమె జీవితంలో మరో పెద్ద విషాదం చోటుచేసుకుంది. కాలేజీ చదువుతుండగానే ఆమె రెండో సోదరుడు కారు ప్రమాదంలో మరణించాడు. తన తల్లి ఎల్లప్పుడూ తన రోల్ మోడల్ అని, ఆమె లేకపోతే తాము లేమని ఆమె అన్నారు. సినిమా రంగంలో కూడా తన తల్లి చూసిన అనుభవాల ఆధారంగా తనకు సలహాలు ఇస్తుంటారని తెలిపింది ఐశ్వర్య.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *