ఐ- బొమ్మ రవికి బిగ్ ఝలక్.. అసలేంజరిగిందంటే?

ఐ- బొమ్మ రవికి బిగ్ ఝలక్.. అసలేంజరిగిందంటే?


పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది. తనపై నమోదైన నాలుగు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో నాంపల్లి కోర్టు ఆయన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో రవి ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నారు.ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవి పిటిషన్లపై ధర్మాసనం ప్రాథమిక విచారణ చేపట్టింది. అనంతరం తదుపరి విచారణను ఈ శుక్రవారానికి వాయిదా వేసింది. పైరసీకి వ్యతిరేకంగా పోలీసులు నమోదు చేసిన ఈ కేసులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. శుక్రవారం జరిగే విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఐబొమ్మ పైరసీ వ్యవహారంపై కొనసాగుతున్న న్యాయపోరాటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం :

బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్‌!

ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో

పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు

నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *