ఐఫోన్‌తో షూటింగ్.. డిజాస్టర్ అయినా కోట్లు వసూల్ చేసింది.. ఏకంగా 3 ఓటీటీల్లో ఉన్న సినిమా

ఐఫోన్‌తో షూటింగ్.. డిజాస్టర్ అయినా కోట్లు వసూల్ చేసింది.. ఏకంగా 3 ఓటీటీల్లో ఉన్న సినిమా


థిల్లర్ సినిమాలకు, హారర్ మూవీలకు ఓటీటీలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వైపు కొత్త సినిమాలు థియేటర్స్ లో అదరగొడుతుంటే మరో వైపు ఓటీటీల్లో సినిమాలు మెప్పిస్తున్నాయి. ఓటీటీలో ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఇప్పటికే ఎన్నో రకాల థ్రిల్లర్ సినిమాలు ఓటీటీని ఊపేస్తున్నాయి. తాజాగా ఓ థిల్లర్ సినిమా ప్రేక్షకులను వణికించేస్తోంది. అమ్మబాబోయ్ ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాల్సిందే.. దైర్యం లేనివాళ్లు ఈ సినిమా చూడకపోవడమే మంచిది. ఇంతకూ ఈ సినిమా ఏదంటే..

ఇది కూడా చదవండి :తండ్రి స్కూల్ ముందు సమోసాలు అమ్మేవాడు.. కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ సింగర్.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. రేజ్ వైరస్ 2002లో వ్యాపించిన 28 సంవత్సరాల తర్వాత, బ్రిటిష్ దీవులు ఇప్పటికీ క్వారంటైన్‌లో ఉన్నాయి. లిండిస్‌ఫార్న్ అనే ద్వీపంలో ఒక చిన్న సమాజం జీవిస్తోంది, ఇది ఒక కాజ్‌వే ద్వారా మెయిన్‌ల్యాండ్‌కు దారి ఉంటుంది. హీరో జామీ, అతని 12 ఏళ్ల కుమారుడు స్పైక్ ఒక కమింగ్-ఆఫ్-ఏజ్ వేట ఆచారం కోసం మెయిన్‌ల్యాండ్‌కు వెళతారు. అక్కడ వారు “ఆల్ఫా” అనే బలమైన, తెలివైన ఇన్‌ఫెక్టెడ్ నాయకుడితో సహా ఇన్‌ఫెక్టెడ్ జోంబీలను ఎదుర్కొంటారు. స్పైక్ తన తల్లి ఇస్లా , ఆమెకు ఒక రహస్య వ్యాధి ఉందని తెలుసుకుని, ఆమెను రక్షించడానికి డాక్టర్ ఇయాన్ కెల్సన్ వద్దకు తీసుకెళ్తాడు.

ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

ఈ సినిమా హర నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ఎక్కువగా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. IMDbలో 6.9/10, కొందరు అభిమానులు కథ బలహీనంగా, ముగింపు నిరాశపరిచిందని భావించారు. అయినా కూడా భారీగా వసూల్ చేసింది ఈ సినిమా. సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1300 కోట్లకుపైగా వసూలు చేసింది. డైరెక్టర్ డానీ బోయల్ క్రియేట్ చేసిన హారర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ నుంచి ఈ సినిమా వచ్చింది. ఆ సిరీస్ లో వచ్చిన మూడో మూవీ 28 ఇయర్స్ లేటర్. ఈ సినిమాను చాలా వరకు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తో తీశారు. ఇక ఈ సినిమా మూడు ఓటీటీల్లోకి వచ్చింది.ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లస్, బుక్‌మైషో స్ట్రీమ్ లలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా చూడాలంటే డబ్బులు చెల్లించాలిసిందే..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *