ఐటీ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఈ ముద్దుగుమ్మ.. ఆమె ఎవరంటే

ఐటీ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఈ ముద్దుగుమ్మ.. ఆమె ఎవరంటే


ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా చాలా మంది హిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న పోటీలో చాలా మంది హీరోయిన్స్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ గా తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్ గా మారింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

సూపర్ స్టార్ మహేష్ బాబుతో తొలి సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ.. కట్ చేస్తే.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. ఆమె ఎవరో కాదు కృతిసనన్. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఐటీ ఎంప్లాయ్ గా పని చేసిన ఆమె నటనపై మక్కువతో హీరోయిన్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన ఈ చిన్నది. ఆతర్వాత బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోలేదు. షారుఖ్ ఖాన్ నటించిన దిల్ వాలే, బరేలీ కి బార్, లుకా చుప్పీ, హౌస్‌ ఫుల్‌, మిమి అనే సినిమాలో నటించింది. మిమి సినిమాలో ఆమె పాత్రకు జాతీయ అవార్డు వచ్చింది. సినిమాలతో పాటు పలు యాడ్స్ లోనూ నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది ఈ భామ. ఇక ఈ చిన్నదాని దగ్గర దాదాపు రూ. 100కోట్ల ఆస్తిపాస్తుల ఉన్నాయి.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *