ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే శుభం జరుగుతుంది?

ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే శుభం జరుగుతుంది?


సోమవారానికి చంద్రుడు అధిపతిగా చెబుతారు. చంద్రగ్రహం శాంతి, స్వచ్ఛత, భావోద్వేగాలకు ప్రతీక. ఈ రోజున తెలుపు, క్రీమ్, లేదా సిల్వర్‌ కలర్‌ దుస్తులు ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుందని చెబుతారు. ఇది కొత్త వారాన్ని ప్రశాంతంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. మంగళవారానికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా చెబుతారు. ఈ గ్రహం శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసాలకు ప్రతీక. ఈ రోజున ఎరుపు, కోరల్, లేదా మెరూన్ రంగు దుస్తులు ధరించడం వల్ల ధైర్యం, శక్తి పెరుగుతాయి. ఇది సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.బుధవారానికి అధిపతి బుధుడుగా చెబుతారు. బుధుడు మేధస్సు, కమ్యూనికేషన్, వాణిజ్యానికి ప్రతీక. ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల మానసిక స్పష్టత, ఏకాగ్రత పెరుగుతాయి. ఇది ముఖ్యమైన సమావేశాలకు లేదా పరీక్షలకు వెళ్లేవారికి మంచిది. గురువారానికి అధిపతి బృహస్పతి అంటే గురుగ్రహంగా చెబుతారు. గురువు జ్ఞానం, సంపద, అదృష్టానికి ప్రతీక. ఈ రోజున పసుపు, నారింజ లేదా బంగారు రంగు దుస్తులు ధరించడం వల్ల అదృష్టం, విజయం, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తాయి. శుక్రవారానికి అధిపతి శుక్రుడుగా చెబుతారు. శుక్రుడు ప్రేమ, అందం, కళలకు ప్రతీక. ఈ రోజున గులాబీ, తెలుపు, లేదా లేత నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల మీపై ఇతరులకు ఆకర్షణ పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. శనివారానికి అధిపతి శని గ్రహంగా చెబుతారు. శని క్రమశిక్షణ, కర్మ, కష్టాలకు ప్రతీక. ఈ రోజున నలుపు, ముదురు నీలం, లేదా ఊదా రంగు దుస్తులు ధరించడం వల్ల ధైర్యం, స్థిరత్వం లభిస్తాయి. ఆదివారానికి అధిపతి రవి. సూర్యుడు శక్తి, ఆత్మవిశ్వాసం, నాయకత్వానికి ప్రతీక. ఈ రోజున ఎరుపు, కాషాయం లేదా బంగారు రంగు దుస్తులు ధరించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి, రోజు ఉత్సాహంగా సాగుతుంది. ఈ రంగులు సూర్య శక్తిని గ్రహించడానికి సహాయపడతాయి.

మరిన్ని వీడియోల కోసం:

ఏటీఎంలో మనీ కాదండోయ్ బుసలు కొట్టే నాగుపాము.. వీడియో చూస్తే వణకాల్సిందే !

షాకింగ్ : హీరోయిన్ బ్యాగ్ నుంచి రూ.70 లక్షల నగల చోరీ వీడియో

ఏం సినిమా రా బాబూ.. దెబ్బకు ప్రపంచ బాక్సాఫీస్ షేక్ వీడియో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *