ఏరియా 51లోనే ఏలియన్స్‌ ?? అంతరిక్షంలో జీవం ఉంది !!

ఏరియా 51లోనే ఏలియన్స్‌ ?? అంతరిక్షంలో జీవం ఉంది !!


విశ్వంలో మనం ఒంటరివాళ్లమా? మరేదైనా గ్రహంపై జీవం ఉందా? మానవాళిని వేధిస్తున్న ఈ ప్రశ్నలకు మాజీ అధ్యక్షుడు ఒబామా సమాధానం ఇచ్చారు. గ్రహాంతరవాసులకు నిలయంగా ఉన్న అమెరికాలోని అత్యంత రహస్య ప్రాంతం ‘ఏరియా 51’ గురించి ఒబామా ఒక పాడ్‌కాస్ట్‌లో సంచలన కామెంట్లు చేసారు. అదొక నిషిద్ధ ప్రాంతమనీ అక్కడేం జరుగుతుందో అమెరికా సైన్యానికి తప్ప ఎవరికీ తెలియదని అన్నారు. అయితే అమెరికా ప్రభుత్వం గ్రహాంతరవాసులను బంధించి ఏరియా 51లో దాచిందనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. తను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీనిపై ఆరా తీశానన్నారు. కానీ ఏలియన్స్‌ను అమెరికా నిర్బంధించిందనడానికి ఎలాంటి ఆధారాలూ దొరకలేదని ఒబామా స్పష్టం చేశారు. ఏలియన్స్‌తో ఏరియా 51కి సంబంధం ఉందంటూ ఓ రేంజ్‌లో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏలియన్స్ ఉన్నాయని తాను గట్టిగా నమ్ముతున్నానని ఒబామా చెప్పారు. అవి ఎక్కడ ఉన్నాయనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. విశ్వం అనంతమైనదని, మరేదో ఒక గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని తాను బలంగా నమ్ముతున్నానని ఒబామా అన్నారు. అమెరికాలో 2020 నుంచి వేలాది స్వచ్ఛంద కార్యకర్తలు అసాధారణ రేడియో సంకేతాలను గుర్తించడం ద్వారా ఏలియన్స్‌ జాడను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ‘ డ్రోన్లు’ గగనతలంలో కొన్ని అసాధారణ వస్తువులను, ఆకారాలను రికార్డు చేశాయనే వార్తలు ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై ఒబామా స్పందిస్తూ.. ప్రభుత్వం దగ్గరున్న రికార్డుల్లో అంతుచిక్కని వస్తువుల చిత్రాలు ఉన్న మాట వాస్తవమే కానీ, అవి గ్రహాంతరవాసులవేనని నిరూపించే స్పష్టమైన సమాచారం అప్పట్లో తన వద్దకు రాలేదని తెలిపారు. నెవాడ ఎడారిలో ఉన్న ఏరియా 51 ఏలియన్స్‌ కోసం కాకుండా రక్షణ సాంకేతికత కోసం నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత రహస్య ఆయుధాల ప్రయోగాలు ఇక్కడ జరుగుతాయి. సామాన్యులకు ఈ ప్రాంతంలోకి ప్రవేశం లేదు. ఒబామా కామెంట్లతో ఏలియన్స్ చర్చ మళ్లీ మొదటికి వచ్చినా.. ఏరియా 51 మిస్టరీ మాత్రం అలాగే కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పక్షికి ఒళ్లంతా విషమే.. ముట్టుకుంటే మరణమే!

సముద్రంలో సరదా విహారం.. ప్రాణాల మీదికొచ్చింది..

Prabhas: దెబ్బ మీద దెబ్బకు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్‌

కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు

‘నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు’ స్టార్ హీరోయిన్ ఆవేదన



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *