క్యాష్ బాక్స్ ఓపెన్ చేయగానే బుస్‌మంటూ పడగవిప్పింది నాగుపాము. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఆ రోజు బ్యాంక్‌లో ఎప్పటిలానే క్యాష్ బాక్స్‌లను సిద్దం చేశారు. ఏటీఎంలో క్యాష్ నింపేందుకు ఫుల్ సెక్యూరిటీతో బాక్స్‌లలో నుంచి డబ్బును తీస్తున్నారు. ఓ క్యాష్ బాక్స్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా పడగవిప్పి పైకిలేచిన నాగుపామును చూసి బ్యాంక్ సిబ్బందితో పాటు అందరూ షాక్ అయ్యారు. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. క్యాష్ బాక్స్‌ను ఓపెన్ చేయగానే బుసలు కొడుతూ నాగుపాము బయటకు రావడంతో భయంతో దూరంగా జరిగారు బ్యాంకు సిబ్బంది. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును జాగ్రత్తగా పట్టుకొని బ్యాంక్ ప్రాంగణం నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం దానిని అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం :