ఈ టైగర్ నట్స్‌ను చుఫా లేదా ఎర్త్ ఆల్మండ్స్ అని పిలుస్తున్నప్పటికి ఇవి నట్స్ జాబితాకు చెందినవిగానే పరిగణించబడుతున్నాయి. ఇవి భూగర్భంలో పండుతాయి.. చూడ్డానికి గొదుమ వర్ణంలో ముడతలు పడినట్టు పొట్టుతో కనిపిస్తాయి. ఇవి కాస్త తియ్యగా, క్రీమ్ లాంటి రుచిని కలిగి ఉంటాయి. వీటిని రోజు గుప్పెడు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ నట్స్ కొన్ని వ్యాదులను కూడా నయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండడంతో ఇది మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి తొడ్పడుతుంది. ఇది మలబద్దక సమస్యలను కూడా క్లియర్ చేస్తుంది. వీటిలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. ఈ నట్స్‌ను మన రోజువారి ఆహారంలో తీసుకుంటే మన జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్‌ల ఉత్పత్తి మెరుగుపడి మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీంతో మనకున్న అజీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి.
ఈ నట్స్‌ను రోజూ తినడం వల్ల గుండె సమస్యలు కూడా దూరం అవుతాయి. వీటిలో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో మన గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
హై బీపీ ఉన్నవారికి కూడా ఈ నట్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. వీటిని రోజూ తినడం వల్ల మన బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఈ నట్స్‌లో ఉండే అర్గైనైన్ అనే అమైనో యాసిడ్ రక్త నాళాలను వెడల్పుగా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీని వల్ల మన బీపీ నియంత్రణలో ఉంటుంది.
ఈ టైగర్ నట్స్‌ను తినడం వల్ల మన డైయాబిటీస్ కూడా కంట్రోల్ ఉంటుంది. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలు నెమ్మదిగా రక్తంలో కలిసి గ్లూకోజ్‌గా మారుతాయి. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు వీటిని రోజూ తినడం వల్ల ప్రయోజనాలను పొందవచ్చు.