
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు జాగరణలో ఉంటారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న సోమవారం నాడు ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం మహాశివరాత్రి అనంతరం ఉద్యోగులకు విశ్రాంతినిచ్చేందుకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
హిందూ పంచాంగం ప్రకారం.. ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. 2026లో మహాశివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. సాధారణంగా ఫిబ్రవరి 15 ఆదివారం కావడంతో అన్ని పాఠశాలలు, కార్యాలయాలకు ముందే సెలవు ఉంటుంది. ఈ ఏడాది మహాశివరాత్రి ఆదివారం రావడం విశేషం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.