ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.720 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.720 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌లో మరో కీలక అడుగు వేసింది. గత ప్రభుత్వ హయాం నుండి పేరుకుపోయిన బకాయిలను తీర్చేందుకు ప్రభుత్వం తాజాగా రూ.720 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా.. 2022 నుండి 2025 ఫిబ్రవరి వరకు పెండింగ్‌లో ఉన్న సరెండ‌ర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను ఒకే విడతలో పూర్తిగా చెల్లించారు. అలాగే ఈ గ్రాట్యుటీ, జీపీఎఫ్ (GPF) విత్‌డ్రాల్స్, మెడికల్ బిల్లులు మరియు ఉద్యోగి అడ్వాన్స్‌ల బకాయిలను క్లియర్ చేయనున్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా ప్రభుత్వం ‘గ్రీన్ ఛానల్’ వ్యవస్థను అమలు చేస్తోంది. దీనివల్ల ట్రెజరీలో ఆటంకాలు లేకుండా ప్రతి నెలా రూ.700 కోట్లకు పైగా బకాయిలు విడుదలవుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వం 3.64 శాతం డీఏ పెంపును ప్రకటించగా, 2023 జూలై నుండి బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనుంది. ఉద్యోగులు తమ బ్యాంకు ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా, ఇకపై నిర్ణీత తేదీల్లోనే నిధులు విడుదలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి పెద్ద ఉపశమనం లభించనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీలంక టూర్ పేరుతో మోసం.. లంకలో కడప టూరిస్టుల విలవిల

పదవి కోసం కన్నబిడ్డను.. ఎంతపని చేశావురా

మైఖెల్ జాక్స‌న్ బయోపిక్‌.. ట్రైలర్‌ వ్యూస్‌లో సరికొత్త రికార్డ్‌

250 అడుగుల ఎత్తులో.. అతి పెద్ద ఆర్చ్‌ నిర్మాణానికి ట్రంప్‌ ప్లాన్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *