ఈ సీరియల్ నటుడి కూతురు ఇండస్ట్రీలో క్రేజీ నటి.. ఏ ఏ సినిమాల్లో నటించిందో తెలుసా.?

ఈ సీరియల్ నటుడి కూతురు ఇండస్ట్రీలో క్రేజీ నటి.. ఏ ఏ సినిమాల్లో నటించిందో తెలుసా.?


సినిమా వాళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో సీరియల్స్ వాళ్లకు కూడా అంటే క్రేజ్ ఉంటుంది. నిజానికి సినిమా వాళ్ళు ఏడాదికి ఒకటో రెండో సినిమాల్లో మెరుస్తారు. కానీ సీరియల్ నటులు అలా కాదు ఏడాది పొడవునా మన టీవీల్లో కనిపిస్తూనే ఉంటారు. ఇక సీరియల్స్ ద్వానా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో ప్రభాకర్ ఒకరు. ఈ సీరియల్ నటుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాకర్ ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆ సమయంలో ఆయనను బుల్లితెర మెగాస్టార్ అని కూడా పిలిచేవారు. ప్రభాకర్ సీరియల్స్ లోనే కాదు సినిమాల్లోనూ నటించారు. ఇప్పటికీ ఆయన సీరియ్సల్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

ఇక ప్రభాకర్ నటించిన సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ఆపరేషన్ దుర్యోధన. ఈ సినిమాలో పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించి మెప్పించాడు ప్రభాకర్. అలాగే చాలా సినిమాల్లో సహాయక పాత్రలు చేశారు. అయితే ప్రభాకర్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలిసిందే ఉంటుంది. మొన్నామధ్య ఆయన కొడుకును హీరోగా పరిచయం చేశారు కూడా.. ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ కూడా చేశారు. కానీ తర్వాత ఆ సినిమా అప్డేట్స్ ఏమీ లేవు. సినిమాలు లేకపోయినా ఆటిట్యూడ్ స్టార్ గా ఇప్పటికే చాలామందికి పరిచయం అయ్యాడు చంద్రహాస్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

ప్రభాకర్ భార్య మలయజ స్వతహాగా యాక్టర్ కానప్పటికీ షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తున్నారు. అలాగే ఆమెకు ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ప్రభాకర్ కూతురు దివిజ కూడా పలు సినిమాల్లో నటించింది. ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఇటీవలే బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మ ఆనందం సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివిజ తన బ్యూటీఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె క్రేజీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ అమ్మడి ఫొటోలో చూసి ప్రభాకర్ కూతురా..! అంటూ అందరూ షాక్ అవుతున్నారు. ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *