ఈ లేడీ కమెడియన్స్ కోడలు టాలీవుడ్ స్టార్ హీరోయినా.! రీసెంట్‌గా రూ. 300కోట్ల హిట్ కొట్టింది ఆ చిన్నది

ఈ లేడీ కమెడియన్స్ కోడలు టాలీవుడ్ స్టార్ హీరోయినా.! రీసెంట్‌గా రూ. 300కోట్ల హిట్ కొట్టింది ఆ చిన్నది


ఈ లేడీ కమెడియన్స్ కోడలు టాలీవుడ్ స్టార్ హీరోయినా.! రీసెంట్‌గా రూ. 300కోట్ల హిట్ కొట్టింది ఆ చిన్నది

కేవలం హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మాత్రమే కాదు.. తెలుగు సినిమాల్లో లేడీ కమెడియన్స్ కూడా చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న వారిలో శ్రీలక్ష్మి ఒకరు. ఎంతో మందికి ఆమె రోల్ మోడల్. ఒకప్పుడు తనదైన నటనతో ప్రేక్షకుల పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు ఆమె వెండితెరపై ఆమె కనిపించగానే అడియన్స్ పెదవులపైకి చిరునవ్వు వచ్చేది. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఆమెకు సపరేట్ కామెడీ ట్రాక్ ఉండేది. హాస్యనటిగానే కాకుండా.. కథానాయికగానూ అలరించారు శ్రీలక్ష్మి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో నటించి మెప్పించారు. తెలుగులో సెకండ్ హీరోయిన్ గానూ నటించారు ఆమె. అప్పట్లోనే ఆమెకు కథానాయికగా ఆఫర్స్ కాకుండా నటిగానే ఆఫర్స్ ఎక్కువగా వచ్చేవట.

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి నటించిన చిత్రాల్లో చంటబ్బాయ్ మూవీ గురించి చెప్పక్కర్లేదు. అలాగే నటి శ్రీలక్ష్మిని చూడగానే ‘బాబు.. చిట్టి ‘ అనే డైలాగ్ గుర్తోస్తుంది. ఇప్పటికీ ఆమె పోషించిన పాత్రలు చాలా ఫేమస్. శ్రీవారికి శుభలేఖ, కలెక్టర్ గారి అబ్బాయి, బంధవులొస్తున్నారు జాగ్రత్త, మాయలోడు, శుభలగ్నం వంటి చిత్రాలతో కడుపుబ్బా నవ్వించారు. కాగా శ్రీలక్ష్మీ మేనకోడలు ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఆ కుర్రభామ. కేవలం గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది. ఆమె ఎవరో కాదు ఐశ్వర్య రాజేష్.

నటి శ్రీలక్ష్మి తమ్ముడు రాజేశ్ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యాడు. పల్లెటూరి మొనగాడు, రెండు జళ్ల సీత, బొబ్బిలి బ్రహ్మన్న వంటి చిత్రాల్లో నటించాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన ఫ్యామిలీ ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు రాజేశ్ కూతురు ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.ఇటీవలే వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మడికి తెలుగులో మంచి ఆఫర్స్ అందుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ అదిరిపోయే ఫొటోలతో కవ్విస్తుంది ఈ భామ.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *