చిన్నతనంలో చాలామంది తల్లులు హాయిగా నిద్రపోయేందుకు.. కొన్ని సార్లు పసుపు, మరికొన్నిసార్లు పిల్లలకు కుంకుమపువ్వు పాలు ఇస్తారు. అయితే ఇంకొంతమంది బెల్లం పాలను కూడా తాగుతారు. వాస్తవానికి, ఈ పద్ధతులన్నీ మంచి నిద్ర కోసం మాత్రమే అవలంబిస్తారు.
ఈ రోజు మనం అలాంటి పానీయం గురించి వివరించబోతున్నాం.. ఈ రెసిపీని పాలతో కాకుండా బాదం పాలతో తయారు చేస్తారు. అంటే పడుకునే ముందు బాదం పాలతో చేసిన దేశీ డ్రింక్.. మీ మూడ్‌ని మరింత మెరుగ్గా మార్చి సమయానికి నిద్రపోయేలా చేస్తుంది.
కావలసిన పదార్థాలు: ఒక కప్పు బాదం పాలు, 2 చిటికెల దాల్చిన చెక్క పొడి, 1/4 టీస్పూన్ పసుపు పొడి, కొంచెం అశ్వగంధ పొడి, రెండు చిటికెల యాలకుల పొడి, 1 స్పూన్ కొబ్బరి నూనె, 1 టీస్పూన్ తేనె, 1 చిటికెడు నల్ల మిరియాల పొడి
పానీయం తయారీ విధానం: తక్కువ మంట మీద బాదం పాలను వేడి చేయండి. పాలు బాగా వేడిగా మరిగిన తర్వాత తేనె తప్ప మిగిలిన అన్ని అందులో వేసి కాసేపు మంటపై ఉంచలి. ఇప్పుడు మంటను ఆపి, పాలు గోరువెచ్చగా మారేలా ఉంచండి. పాలు కొద్దిగా వెచ్చగా అయినా తర్వాత జల్లెడ పట్టి తేనెను జోడించాలి. ఆ తర్వాత ఆ పాలను తాగండి. అనంతరం బ్రష్ చేసి నిద్రపోతే పళ్లు పసుపు రంగులోకి మారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని రోజుల పాటు దీన్ని నిరంతరం తీసుకోవడం వల్ల త్వరగా నిద్ర వస్తుంది.
నిద్రపోయే ముందు పాలు-బెల్లం, పసుపు పాలు లేదా కుంకుమపువ్వు అధికంగా ఉండే పాలను తీసుకోండి. దీంతో త్వరగా నిద్రపోవచ్చు. ఈ పానీయాన్ని సిద్ధం చేసుకొని నిద్రపోయే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుంది. వాతావరణాన్ని దృష్టిలో చల్లని లేదా వేడి నీటితో స్నానం చేస్తే నిద్ర ఎక్కువగా వస్తుంది. నిద్రపోయే ముందు తలకు మసాజ్ చేస్తే శరీరం రిలాక్స్ అయ్యి నిద్ర త్వరగా వస్తుంది.