ఈ చీరల క్రేజ్‌ చూస్తే మైండ్ బ్లాంకే.. తెల్లవారుజామున 4 నుంచే క్యూలైన్లు.. ఎందుకంత డిమాండ్ అంటే..?

ఈ చీరల క్రేజ్‌ చూస్తే మైండ్ బ్లాంకే.. తెల్లవారుజామున 4 నుంచే క్యూలైన్లు.. ఎందుకంత డిమాండ్ అంటే..?


సాధారణంగా ఐఫోన్ విడుదలైనప్పుడో లేదా భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అయినప్పుడో తెల్లవారుజామున థియేటర్ల వద్ద క్యూలైన్లను చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఒక చీర కోసం మహిళలు, పురుషులు వేల సంఖ్యలో రోడ్లపై బారులు తీరుతున్నారు. అదే మైసూర్ సిల్క్ చీర. 2026లో ఈ చీరల క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే.. వీటిని ఫ్యాషన్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బిర్కిన్ బ్యాగులతో పోలుస్తున్నారు. కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ షోరూమ్‌ల వద్ద దృశ్యాలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రభుత్వం అందించే రాయితీ లేదా ప్రత్యేక సేల్స్ సమయంలో ఒరిజినల్ మైసూర్ సిల్క్ చీరలను సొంతం చేసుకోవడానికి జనం తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూ కడుతున్నారు. కేవలం కర్ణాటక నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మహిళలు తరలివస్తుండటం విశేషం.

మైసూర్ సిల్క్ అంటే ఎందుకంత క్రేజ్?

మైసూర్ సిల్క్ చీరలకు దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. వీటికి అంత డిమాండ్ ఉండటానికి ప్రధాన కారణాలు. ఈ చీరల అంచులలో ఉపయోగించే జెరీలో స్వచ్ఛమైన వెండి, బంగారం వాడతారు. ఈ చీరలు దశాబ్దాల కాలం పాటు కొత్తవిగానే ఉంటాయి. అందుకే వీటిని వారసత్వ సంపదగా భావిస్తారు. ఒకప్పుడు రాజకుటుంబీకులు మాత్రమే ధరించిన ఈ చీరలు.. ఇప్పుడు మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అందరికీ ఒక స్టేటస్ సింబల్‌గా మారాయి.

ప్రస్తుత ఫ్యాషన్ ట్రెండ్స్‌లో ఈ చీరలను లగ్జరీ వస్తువులతో పోలుస్తున్నారు. విదేశాల్లో బిర్కిన్ బ్యాగుల కోసం వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్టే, మైసూర్ సిల్క్ చీరల కోసం ఇప్పుడు ఇండియాలో వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. వీటి ధర పెరిగే కొద్దీ వీటి విలువ కూడా పెరుగుతుండటంతో మహిళలు వీటిని ఒక ఫ్యాషన్ ఇన్వెస్ట్‌మెంట్ గా చూస్తున్నారు. టెక్నాలజీ యుగంలోనూ మన సంప్రదాయ చేనేత వస్త్రాలకు ఉన్న ఆదరణ తగ్గలేదని ఈ క్యూలైన్లు నిరూపిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *