ఆత్మాహుతి దాడుల్లో ఇద్దరు మహిళలు పాల్గొన్నారని.. అసీఫ్ మెంగల్ అనే అమ్మాయి మహ్మద్ ఇస్మాయిల్ కుమార్తె అని.. బలూచిస్తాన్‌లోని నుష్కి నివాసి అని తెలిపింది బలూచ్ ఆర్మీ. అసీఫ్ మెంగల్ తన 21వ పుట్టినరోజున BLA లో చేరిందని… 2024లో ‘ఫిదాయీ’ అంటే ఆత్మాహుతి బాంబర్ కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. మరో యువతి హవా బలోచ్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాడికి ముందు అసీఫా మెంగల్ తన BLA సహచరులతో కలిసి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తున్నట్లు ఒక వీడియో సర్కులేట్ అవుతోంది. ఆ వీడియోలో పాకిస్తాన్ ప్రభుత్వం .. అణిచివేతకు గురైన మహిళలపై మాత్రమే అధికారాన్ని ప్రదర్శిస్తోందని..తమను నేరుగా ఎదుర్కోలేదని..అందుకు వారి సామర్థ్యం సరిపోదని అసిఫా సవాలు చేసినట్లుగా ఉంది. వీడియోలో అసిఫా చేతిలో తుపాకీతో బిగ్గరగా నవ్వుతోంది.