ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించలేకపోతున్నారు.. ఇది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా.. మన జీవనశైలి, తీసుకునే ఆహారంపై దృష్టిపెట్టడంతోపాటు.. మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో చాలా సమస్యలను నివారించవచ్చు.. ఆయుర్వేదం ప్రకారం.. మన పెరట్లో లభించే మొక్కలు, ఆకులతో చిన్న చిన్న సమస్యల నుంచి నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చు.. అలాంటి ఆకుల్లో.. వాము ఆకులు ఒకటి.. వాము ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దాగున్నాయి.. వీటిలోని పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడతాయి..
వాము ఆకుల్లో ముఖ్యంగా విటమిన్లు A, B, C, E తోపాటు.. ఖనిజాలు, పీచు పదార్థం, కార్బోహైడ్రేట్లు, అమినో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాము ఆకుల్లో థైమోల్ ఉండటం వల్ల వాటిని సహజ మౌత్ ఫ్రెషనర్లు అంటారు. వర్షాకాలం ప్రారంభంతో, దగ్గు, జలుబు కూడా ప్రారంభమవుతాయి. ఈ ఆకులు వీటికి అద్భుతంగా పనిచేస్తాయి.. ముఖ్యంగా వర్షా కాలంలో ఉదయాన్నే రెండు ఆకులు తింటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వాము ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
వాము ఆకులను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఈ ఆకులను నీటిలో మరిగించి త్రాగడం వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వాము ఆకులలోని పోషకాలు రక్తపోటును నియంత్రించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి.
వాము ఆకులు జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతోపాటు.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
వాము ఆకులు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. వాము ఆకులను నమలడం వల్ల ఉబ్బరం, గ్యాస్ట్రిటిస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
వాము ఆకులను రెగ్యులర్ గా తీసుకుంటే.. బరువు నియంత్రణలో ఉంటుంది.. క్రమంగా బరువు కూడా తగ్గడానికి సహాయపడుతుంది.
వాము ఆకులు క్రిమినాశక లక్షణాలతో నిండి ఉంటాయి.. వీటిని తీసుకోవడం వల్ల ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి..
దీనిలో ఉండే థైమోల్ అనే మూలకం ఇన్ఫెక్షన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
వాము ఆకులు ఎముకలకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.
వాము ఆకులను పేస్ట్ లా చేసి వాసన చూస్తే ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం లభిస్తుంది.
వాము ఆకులో అనాల్జేసిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి పంటి నొప్పి, తలనొప్పి, శరీర నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
వాము ఆకుల పేస్ట్ ని నొప్పి ఉన్న ప్రదేశంలో పూయడం వల్ల వాపు తగ్గి నొప్పి తగ్గుతుంది.
వాము ఆకుల కషాయం తాగడం వల్ల ఋతుస్రావం సమయంలో మహిళలు అనుభవించే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
అలర్జీ ఉన్న వారు వాము ఆకుల రసాన్ని ప్రభావిత ప్రాంతంలో పూయడం ద్వారా దాని నుంచి విముక్తి లభిస్తుంది.
వాము ఆకులను నీటిలో మరిగించి కషాయంగా తాగవచ్చు.. లేదా పచ్చిగా కూడా నమిలి తినవచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..