ఈజిప్టు పిరమిడ్‌లలో తమిళ వ్యాపారి పేరు!

ఈజిప్టు పిరమిడ్‌లలో తమిళ వ్యాపారి పేరు!


ఈ శాసనాలు ప్రాచీన కాలంలో ప్రపంచ వాణిజ్య పటంలో తమిళులు ప్రధాన పాత్ర పోషించినట్టు రుజువు చేస్తున్నాయని తమిళనాడు ఆర్థిక మంత్రి తెన్నరసు అన్నారు. ఈజిప్టు పిరమిడ్‌లలో తమిళ వ్యాపారి పేరు ఉండటం గర్వకారణమనీ, అధ్యయనంలో ఈజిప్టు పిరమిడ్‌లలో 2000 ఏళ్ల నాటి శిలాశాసనాలు గుర్తించారని తెలిపారు.
వాటిలో కొన్నింటిలో తమిళ వ్యాపారి పేరును గుర్తించారని దీన్నిబట్టి వేల సంవత్సరాల క్రితమే తమిళులు సముద్రాలు దాటి వ్యాపారం చేశారనే విషయం తెలుస్తుందన్నారు. ప్రపంచ వాణిజ్యంలో తమిళులు ఎంతగా తమదైన ముద్ర వేశారో ఈ ఉదాహరణ చాలన్నారు.చెన్నైలో తమిళ ఎపిగ్రఫీపై బుధవారం ప్రారంభమైన నాలుగు రోజుల సదస్సులో స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ స్ట్రౌచ్‌ పాల్గొన్నారు. అక్కడి పిరమిడ్‌లలోని ఆరు రాతి సమాధుల్లో తమిళ బ్రహ్మీ, ఆరు పాకృత భాషల్లో సుమారు 30 శాసనాలను వారు గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *