ఇల్లు చూడాలంటే నెల అద్దె కట్టాలా.. బెంగళూరులో సెక్యూరిటీ గార్డు డిమాండ్‌కు యువకుడు షాక్..

ఇల్లు చూడాలంటే నెల అద్దె కట్టాలా.. బెంగళూరులో సెక్యూరిటీ గార్డు డిమాండ్‌కు యువకుడు షాక్..


దేశీయ ఐటీ రాజధాని బెంగళూరులో ఇల్లు దొరకడం అంటే ఆకాశంలో చందమామను పట్టడమే అన్నట్లు తయారైంది. భారీ అద్దెలు, లక్షల్లో డిపాజిట్లు వినడమే తప్ప.. ఇప్పుడు కొత్తగా విజిటింగ్ ఫీజు పేరుతో జరుగుతున్న వింత దోపిడీ నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. కేవలం ఖాళీగా ఉన్న ఫ్లాట్‌ను చూపించడానికి ఏకంగా నెల అద్దెను డిమాండ్ చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. బెంగళూరులో ఇల్లు వెతుకుతున్న ఓ యువ ప్రొఫెషనల్ తనకి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికైన రెడ్డిట్‌లో పంచుకున్నాడు. సుమారు రెండు నెలల క్రితం అతను ఒక మల్టీ స్టోరీ అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లి, అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డును ఏమైనా ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయా? అని ఆరా తీశాడు. గార్డు ఒక ఫ్లాట్ ఖాళీగా ఉందని చెప్పి, యజమాని నంబర్ ఇచ్చాడు. యజమానితో మాట్లాడిన తర్వాత సెక్యూరిటీ గార్డు ఫ్లాట్ చూపించడానికి సిద్ధమయ్యాడు.

ఈ నేపథ్యంలో గార్డు పెట్టిన కండిషన్ విని ఆ యువకుడికి మైండ్ బ్లాక్ అయింది. ఫ్లాట్ లోపలికి వెళ్లి చూడాలంటే.. ముందుగా ఒక నెల అద్దె నాకు కమీషన్‌గా ఇవ్వాలి అని ఆ గార్డు డిమాండ్ చేశాడు. సాధారణంగా బ్రోకర్లు కమీషన్ అడగడం చూస్తుంటాం కానీ కేవలం తాళం తీసి ఇల్లు చూపించడానికి నెల అద్దె అడగడం ఆ కుర్రాడిని షాక్‌కు గురి చేసింది. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని మోసం చేయడానికే చూస్తున్నారు. మనం నైతికంగా దివాలా తీశాం అని ఒకరు వ్యాఖ్యానించగా.. ఇంటి యజమానులు, బ్రోకర్లు అద్దె పేరుతో ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు అని మరొకరు మండిపడ్డారు. బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఇళ్లు వెతికేటప్పుడు ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్రిమెంట్ అవ్వకుండా ఇల్లు నచ్చకుండా ఎవరికీ పైసా కూడా చెల్లించవద్దని సూచిస్తున్నారు.

Bangalore Rent Woes

Bangalore Rent Woes



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *