ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి


గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా వరుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన వరుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇక ఈ సినిమాలో ఐదురోజుల పెళ్లి అంటూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా 2010లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరుడు సినిమాలో హీరోయిన్ విషయంలో సస్పెన్స్ మెయింటేన్ చేశాడు దర్శకుడు గుణశేఖర్. సినిమా మొదలైన చాలా సమయం తర్వాత హీరోయిన్ ను చూపిస్తాడు. ప్రేక్షకులకు అది కాస్త ఎక్కలేదు. ఇంతకు ఈ హీరోయిన్ గుర్తుందా.? ఆ హీరోయిన్ పేరు భాను శ్రీ మెహ్ర. వరుడు సినిమాతో ఈ అమ్మడు ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా కంటే ముందు హిందీలో ఓ సినిమా చేసింది.

ఇది కూడా చదవండి :కోటీశ్వరుల సంబంధాలకు నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడింది.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

వరుడు సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో.. భానుకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత హిందీలో, అలాగే తమిళ్ లో సినిమాలు చేసింది. కానీ హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఇది కూడా చదవండి : ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పని చేశాడు.. ఇప్పుడు పాన్ ఇండియాను ఏలుతున్నాడు.. అతను ఎవరంటే

మొన్నామధ్య అల్లు అర్జున్ తనను అన్ ఫాలో చేశాడని.. నీ సినిమా వల్ల నాకు కలిసొచ్చిందేమి లేదు అంటూ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది. ఆతర్వాత తిరిగి బన్నీ ఆమెను ఫాలో చేశాడు. ఇప్పుడు ఈ భామ సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తుంది. క్రేజీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందా అని నెటిజన్స్ సోషల్ మీడియాను తెగ గాలిస్తున్నారు. రెగ్యులర్ గా వెకేషన్స్ కు వెళ్తూ అక్కడి వీడియోలు షేర్ చేస్తుంది ఈ భామ.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మాస్ మావ..! ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. స్టార్స్ లేకుండానే బ్లాక్ బస్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *