ఇదెక్కడి దారుణం.. గుడ్లు అప్పుగా ఇవ్వలేదని.. దళితుడిపై భీకర దాడి!

ఇదెక్కడి దారుణం.. గుడ్లు అప్పుగా ఇవ్వలేదని.. దళితుడిపై భీకర దాడి!


ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో కరౌండికల పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఫిరిహిరి గ్రామంలో గూండాలు దళిత వర్గ ప్రజలపై దాడి చేశారు. అప్పుగా గుడ్లు ఇవ్వనందుకు వారిని కర్రలతో కొట్టారు. స్థానిక బిజెపి ఎమ్మెల్యే రాజేష్ గౌతమ్‌కు సమాచారం అందడంతో ఆయన వెంటనే అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రెండు వైపుల నుండి ఫిర్యాదులు అందిన తర్వాత పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేశారు.

కరౌండికల పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిరిహిరి గ్రామంలో నివసించే దళిత శివ అనే వ్యక్తి గుడ్డు దుకాణం నడుపుతున్నాడు. బుధవారం గ్రామానికి చెందిన సూరజ్ భాన్ యాదవ్, వివేక్ యాదవ్ అతని దుకాణానికి చేరుకుని అప్పుగా గుడ్లు అడిగారు. శివ నిరాకరించడంతో అతనిపై వాళ్లు దాడికి దిగారు. ఈ సమయంలో అక్కడి ప్రజలు జోక్యం చేసుకోవడంతో సూరజ్ భాన్ యాదవ్, వివేక్ యాదవ్ ఇతర కుటుంబ సభ్యులకు, సహచరులకు ఫోన్ చేశారు. వారంతా వచ్చి కర్రలతో వచ్చి శివ, అతని కుటుంబ సభ్యులను కొట్టారు. ఈ గొడవలో ఒక మహిళతో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ధీరజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతన్ని లక్నోకు రిఫర్ చేశారు. గొడవ సమయంలో సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

సూరజ్ భాన్ యాదవ్, వివేక్ యాదవ్ కుటుంబ సభ్యులు శివ, అతని కుటుంబ సభ్యులను ఎలా దారుణంగా కొడుతున్నారో వీడియోలో చూడవచ్చు. వీడియో బయటకు వచ్చినప్పటికీ పోలీసులు రెండు వర్గాలపై కేసు నమోదు చేశారు. కదిపూర్ ఎమ్మెల్యే రాజేష్ గౌతమ్ ఈ ఘటనకు గురించి తెలుసుకొని బాధితుల వద్దకు చేరుకుని మొత్తం సంఘటనను పరిశీలించారు. కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *