ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! మెడిసిన్ కోసం మిస్ ఇండియా ఛాన్స్ వదులుకుంది.. ఇప్పుడు తోప్ హీరోయిన్

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! మెడిసిన్ కోసం మిస్ ఇండియా ఛాన్స్ వదులుకుంది.. ఇప్పుడు తోప్ హీరోయిన్


పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.? ఆమె ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తల్లిదండ్రూలిద్దరూ ప్రముఖ నటులే. వారిద్దరి అడుగుజాడల్లోనే నడుస్తూ ఈ ముద్దుగుమ్మ కూడా సినిమాల్లోకి అడుగు పెట్టింది. కానీ సైన్ చేసిన మొదటి రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఐరన్ లెగ్ అంటారేమోనన్న భయంతో సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందే డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందీ అందాల తార. అయితే సినిమా రంగంలో ఎంతో అనుభవమున్న తల్లిదండ్రుల సూచనలతో క్రమంగా కోలుకుంది. మళ్లీ హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెట్టింది. వరుసగా సినిమాలు చేసింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ తన నటనతో ఆడియెన్స్ ను మెప్పించింది. అన్నట్లు ఈ టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

నటిగా కంటే డాక్టర్ కావడమే తన మొదటి లక్ష్యమంటోంది. అందుకే ప్రతిష్ఠాత్మక మిస్ ఇండియా పోటీలను సైతం వద్దనుకుంది. మరి ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు సీనియర్ హీరో రాజశేఖర్ దంపతుల కుమార్తె శివానీ రాజశేఖర్. తాజాగా ఈ అందాల తారకు మాధవన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అది కూడా ఒక పాన్ ఇండియా సినిమాలో. ఈ నేపథ్యంలో శివానీ రాజశేఖర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

కాగా 2022లో శివానీ రాజశేఖర్ కు ఒక బంపరాఫర్ వచ్చింది. ప్రతిష్ఠాత్మక ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనే సువర్ణావకాశం లభించింది. శివానీ కూడా ఈ అందాల పోటీల్లో పాల్గొంటున్నట్లు ఎంతో సంతోషంగా ప్రకటించింది. కానీ కొన్ని రోజులకే సడెన్‌గా ఫెమినా మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేసింది. శివానీ ఫెమినా మిస్ ఇండియా కంటెస్ట్ రోజునే.. ఈమె రాస్తున్న మెడికల్ థియరీ ఎక్సామ్ అదే రోజున ఉన్నందున ఈ అందాల పోటీలో పాల్గొనలేకపోతున్నానంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే .. ఒక డాక్టర్ కావాలనదే తన కోరిక అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *