ఇక పాక్, చైనాలకు చుక్కలే..రూ. లక్ష కోట్ల ఆయుధ కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఇక పాక్, చైనాలకు చుక్కలే..రూ. లక్ష కోట్ల ఆయుధ కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్


ఆపరేషన్ సింధూర్‌తో ఇండియన్ ఆర్మీ మన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకేసారి 9 టార్గెట్లను విజయవంతంగా నాశనం చేయడంతో మన ఆయుధాల పనితీరు శత్రువులకు తెలిసొచ్చింది. ఎస్-400, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనితీరును ప్రపంచం ఆశ్చర్యపోయి చూసింది. పాక్‌కు అటు చైనా, టర్కీ అండగా ఉన్న వేళ.. మనం మన ఆయుధ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఇంకా బలోపేతం చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ భారీ ఆయుధాల కొనుగోలుకు సిద్ధమైంది. ఏకంగా రూ.లక్ష కోట్లతో వీటిని కొనుగోలు చేయనుంది. ఇందులో 3 ప్రధాన ఆయుధ ప్రాజెక్టులు కాగా.. 7 చిన్నవి. వీటిలో ముఖ్యమైనది మైన్స్ కౌంటర్ మేజర్ వెసెల్స్ . దీన్ని కోసం రక్షణశాఖ రూ.44వేల కోట్లను ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నౌకాదళానికి 12 ఎంసీఎంవీలు అందనున్నాయి. యుద్ధంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. 900 నుంచి 1000 టన్నుల సామర్ధ్యంతో ఉండే ఈ నౌకలు శతృదేశాలను ఉక్కిరిబిక్కిరి చేయగలవు. సముద్రంలో శత్రువుల దాడులను తిప్పికొడతాయి. చైనా, పాకిస్తాన్ సముద్ర కుట్రల మధ్య ఇవి కీలకంగా మారనున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి పదేళ్లు పట్టే అవకాశం ఉంది.

ఇక రెండవది క్విక్ రియాక్షన్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ రూ.36వేల కోట్లను ఖర్చు చేయనుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు వీటిని అందజేయనున్నారు. ఇవి 30 కిలోమీటర్ల పరిధిలో శత్రు దేశపు డ్రోన్లు, మిస్సైల్స్, యుద్ధవిమానాలను గుర్తించి గాల్లోనే ధ్వంసం చేయగలవు. ఆపరేషన్ సింధూర్‌లో మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసిందో అంతా చూశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా వీటిని కొనుగోలు చేయనుంది.

ఇక మూడోవది ఇంటిలిజెన్స్ సర్వేలైన్స్ అక్విజిషన్ అండ్ రీకాన్సెస్. ఈ ప్రాజెక్టు కోసం రూ. 10వేల కోట్లు ఖర్చు పెట్టనుంది. ఇవి శత్రు దేశాల యుద్ధవిమానాలు, మిస్సైల్స్‌ను గుర్తించి రియల్ టైమ్‌లో సమాచారాన్ని అందిస్తాయి. అదేవిధంగా ఉగ్రస్థావరాల గట్టి నిఘా పెట్టొచ్చు. వీటితో పాటు ఐఎస్ఆర్, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్, ఆర్మర్డ్ రికవరీ వెహికిల్స్ వంటి ఏడు చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ మన దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మారుస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *