నగర రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల పట్ల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై ఇప్పటికే కొరడా ఝుళిపించిన పోలీసులు, ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు. మార్చి 1 నుంచి నగరం అంతటా నిరంతర ప్రత్యేక దాడులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ లేదా డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి. లేని పక్షంలో భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవు. మీ వాహనాన్ని లైసెన్స్ లేని వారికి ఇస్తే, వాహన యజమానిని కూడా బాధ్యుడిని చేస్తూ కేసులు నమోదు చేస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే, ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరిస్తాయి. దీనివల్ల వాహనం డ్యామేజ్ అయినా లేదా ఇతర నష్టాలు జరిగినా అన్నీ జేబు నుంచే చెల్లించుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ లేని వారు వెంటనే ఆర్టీఏ (RTA) కార్యాలయం ద్వారా స్లాట్ బుక్ చేసుకుని లైసెన్స్ పొందాలని పోలీసులు సూచిస్తున్నారు. గత 10 రోజులుగా రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు లైసెన్స్ తనిఖీలపై దృష్టి సారించారు. జేబు గుల్ల కాకుండా ఉండాలన్నా, చట్టపరమైన ఇబ్బందులు రాకూడదన్నా నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ విభాగం స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేబుల్ వైర్లు కాదు.. యమ పాశాలు.. నిర్లక్ష్యంపై ఆగ్రహం
డయాబెటిస్ నిర్థారణకు.. HBA1C టెస్ట్ ఒక్కటే కరెక్ట్ కాదు!
ఎన్నికల కౌంటింగ్‌లో కొత్త ‘సెక్యూరిటీ గార్డ్’