భారతదేశం ప్రపంచ ఆర్థిక, సాంకేతిక శక్తి కేంద్రంగా స్థిరంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దాని పట్టణ జనాభాకు భద్రత ఒక ముఖ్యమైన సమస్యగా మిగిలిపోయింది. 2025 మధ్యలో విడుదలైన నంబియో భద్రతా సూచికలో భారతదేశం 55.8 సాధారణ భద్రతా స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా 67వ స్థానంలో నిలిచింది.. అయినప్పటికీ, దాని నగరాలను పరిశీలించనప్పుడు కొన్ని పట్టణ కేంద్రాలు తమ నివాసితులకు ఎక్కువ భద్రతా భావాన్ని అందించడంలో ప్రత్యేకంగా నిలుస్తాయి. శుభ్రమైన వీధులు, క్రమశిక్షణ కలిగిన పౌర వ్యవస్థలకు ప్రసిద్ధి చెందిన మంగళూరు, భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 49వ స్థానాన్ని దక్కించుకుంది.
2025 ప్రథమార్థంలో విడుదలైన నంబియో సేఫ్టీ ఇండెక్స్ ర్యాంకింగ్స్ ప్రకారం.. మంగళూరు భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచింది. దీని తర్వాత వడోదర, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, నవీ ముంబై, తిరువనంతపురం, చెన్నై, పూణే, చండీగఢ్ ఉన్నాయి. హైదరాబాద్, ముంబై, లక్నో, కోల్‌కతా, ఇండోర్, గురుగ్రామ్, బెంగళూరు, నోయిడా, ఘజియాబాద్, ఢిల్లీలు చివరి 10 స్థానాల్లో నిలిచాయి.
గుజరాత్ భద్రతా పటంలో మెరుస్తోంది. దాని మూడు నగరాలు – వడోదర, అహ్మదాబాద్, సూరత్ – జాతీయ స్థాయిలో టాప్ 10లో చోటు సంపాదించాయి. మరోవైపు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రధాన NCR కేంద్రాలు నేరాలతో పోరాడుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…