ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..

ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..


ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..

ఆధునిక జీవనశైలిలో మన అలవాట్లు మారుతున్నాయి.. మన ఇళ్లు మారుతున్నాయి. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన ఇండియన్ టాయిలెట్ స్థానాన్ని ఇప్పుడు వెస్ట్రన్ కమోడ్స్ ఆక్రమించాయి. అయితే ఈ మార్పు సౌకర్యాన్ని ఇస్తున్నప్పటికీ.. మన జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తోందా? ఇటీవల పెరుగుతున్న మలబద్ధకం, పైల్స్ సమస్యలకు టాయిలెట్ భంగిమకు ఏమైనా సంబంధం ఉందా..? న్యూఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ నిపుణులు డాక్టర్ సోనియా రావత్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ఇండియన్ టాయిలెట్: జీర్ణక్రియకు వరమా?

డాక్టర్ రావత్ వివరణ ప్రకారం.. భారతీయ శైలిలో మోకాళ్లు వంచి కూర్చోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ భంగిమలో కూర్చున్నప్పుడు పురీషనాళం నిఠారుగా మారుతుంది. దీనివల్ల మలం ఎటువంటి అవరోధం లేకుండా సులభంగా బయటకు వెళ్తుంది. ఈ పొజిషన్ కటి కండరాలు సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ప్రేగులపై అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. పొట్ట పూర్తిగా ఖాళీ అవ్వడం వల్ల మలబద్ధకం సమస్య దరిచేరదు.

వెస్ట్రన్ టాయిలెట్: సౌకర్యం సరే.. ఆరోగ్యం మాటేంటి?

వెస్ట్రన్ టాయిలెట్ల మీద కుర్చీలో కూర్చున్నట్లు కూర్చోవడం సౌకర్యంగా ఉన్నప్పటికీ అది కొన్ని సమస్యలకు దారితీయవచ్చు. ఈ భంగిమలో పురీషనాళం కొద్దిగా వంగి ఉంటుంది. దీనివల్ల పేగులను పూర్తిగా ఖాళీ చేయడం శరీరానికి కష్టమవుతుంది.అసంపూర్ణ మలవిసర్జన కాలక్రమేణా మలబద్ధకం, గ్యాస్, మూలవ్యాధుల వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఎవరికి ఏది ముఖ్యం?

అయితే అందరికీ ఇండియన్ టాయిలెట్లే వాడాలని నియమం లేదు. మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు ఉన్నవారు లేదా వృద్ధులకు వెస్ట్రన్ టాయిలెట్లు సురక్షితమైనవి.మీరు వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నట్లయితే, మీ పాదాల కింద ఒక చిన్న స్టూల్ ఉంచుకోవడం వల్ల మోకాళ్లు పైకి లేచి ఇండియన్ టాయిలెట్ భంగిమ వస్తుంది. ఇది మలవిసర్జనను సులభతరం చేస్తుంది.

జంక్ ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇప్పటికే జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సరైన టాయిలెట్ భంగిమను ఎంచుకోవడం వల్ల మీ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *