భారతదేశ సాంప్రదాయ నిర్మాణ శైలి, రూపకల్పనను వివరించే సాహిత్యం వాస్తు శాస్త్రం. వేదాల ఆధారంగా భూమిపై నిర్మించే సూత్రాలు, పద్ధతులను వాస్తు వివరిస్తుంది. వాస్తు శాస్త్రం అంటే శారీరక ఆరోగ్యం, మనశ్శాంతి, ఆర్థిక వృద్ధి, ఆస్తి విలువ పెరుగుదలకు సంబంధించిన నియమావళి. హిందూ మతంలో వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.. వాస్తు సరిగ్గా చేస్తేనే ఆ ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుందని, ఆనందం, శ్రేయస్సును ఉంటుందని నమ్ముతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం. ఇంట్లో సమయాన్ని సూచించే గడియారాన్ని కూడా సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం లేని గడియారం కారణంగా కుటుంబం ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. మన ఇంట్లో సరైన దిశలో, సరైన స్థలంలో ఉంచిన గడియారం మన భవిష్యత్తును సరైన దిశలో నడిపిస్తుందని నమ్ముతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు దిశలో ఉన్న గడియారం మీ ఇంటికి శుభం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఉత్తర దిశలో ఉన్న గడియారం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఇంటి గోడలపై పడమర, దక్షిణ దిశలలో గడియారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దు అంటున్నారు వాస్తు నిపుణులు. ఈ గడియారాలు మీకు చెడు సమయాలను తెస్తాయని, ఇంట్లో, కార్యాలయంలో సమస్యలను పెంచుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
వాస్తు శాస్త్రం ప్రకారం, తలుపు మీద గడియారం పెట్టకూడదు. తలుపు మీద గడియారం పెట్టడం శుభం కాదని అంటున్నారు. ఇంట్లో ఎప్పుడూ ఆగిపోయిన గడియారాన్ని ఉంచుకోకండి. దీని వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు పెరుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, విరిగిన లేదంటే పాడైపోయిన గడియారం ఉంటే అది మీ పరిస్థితిని పాడు చేస్తుంది. విరిగిన గడియారాన్ని దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న గడియారం విరిగిపోతే, లేదంటే పాడైపోయినా దానిని ఇంటి నుండి బయటకు విసిరేయండి.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..